హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Talent: తెలుగు కుర్రాడి సత్తాకు అమెరికా సలామ్! టాప్‌ స్పీకర్‌ అవార్డు గెలుచుకున్న సాహిత్‌

Talent: తెలుగు కుర్రాడి సత్తాకు అమెరికా సలామ్! టాప్‌ స్పీకర్‌ అవార్డు గెలుచుకున్న సాహిత్‌

సాహిత్ మంగు

సాహిత్ మంగు

Talent: వయసు కేవలం 12ఏళ్లు.. అయితే టాలెంట్‌ మాత్రం అద్భుతం! ఇతర పిల్లలు మాట్లాడడానికే తడబడే ఈ వయసులో.. ఈ విద్యార్థి మాత్రం అవార్డులు గెలుస్తున్నాడు. ఇంతకీ ఎవరా కుర్రాడు..? ఏం చేశాడు! ఏం గెలుచుకున్నాడు..?

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అతనో 12ఏళ్ల విద్యార్థి .. అయితే అందరిలా కాదు.. ఏదో సాధించాలని కలలు కన్న కుర్రాడు. అతన గొంతు లోతుల్లో దాగి ఉన్న టాలెంట్‌ను ప్రపంచానికి చూపించాలనే లక్ష్యంతో ముందుకు సాగాడు.. ప్రతీ సబ్జెక్టుపై పట్టు సాధించాడు..! ప్రతిష్టాత్మక గార్డెన్‌ స్టేట్‌ డిబేట్‌ లీగ్‌ టోర్నమెంట్‌ కోసం ప్రిపేర్ అయ్యాడు.. ఆ పోటీ రానే వచ్చింది. ‌తాను ఎంచుకున్న అంశలతో డిబేట్ చేశాడు.. అక్కడున్న జడ్జిలు ఆ కుర్రాడి సత్తాకు సలామ్‌ కొట్టారు. అతడినే విజేతగా ప్రకటించారు.. దీంతో ప్రపంచ వేదికపై మన తెలుగోడి సత్తా మరోసారి బయటపడింది. ఏ దేశమేగినా తెలుగు విద్యార్థుల ప్రతిభ పరిమళిస్తూనే ఉంటుందనడానికి ఈ విద్యార్థే సాక్ష్యం. ఇంతకి ఎవరా కుర్రాడు..?

హైదరాబాద్‌ టు అమెరికా.. ఏ సక్సెస్‌ స్టోరీ:

సాహిత్‌ మంగు (Sahith mangu) ..ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. న్యూజెర్సీ సోమర్‌సెట్‌లోని సెడార్‌ హిల్‌ ప్రిపరేటరీ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు సాహిత్‌. భారత్‌ నుంచి అమెరికా వెళ్లిన హైదరాబాదీ కుటుంబం తనది. అక్కడే స్థిరపడ్డారు. న్యూజెర్సీలో ప్రతీ ఏడాది డిబెట్‌ లీగ్‌ టోర్నమెంట్లు జరుగుతాయి. అందులో గార్డెన్‌ స్టేట్ లీగ్‌ టోర్నిమెంట్‌ చాలా ప్రతిష్టాత్మకమైనది. ఈ డిబెట్‌ లీగ్‌లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తమ స్కిల్స్‌ చూపించడానికి వస్తారు. ఈ ఏడాది వేర్వేరు పాఠశాలలకు చెందిన 164 మంది విద్యార్థులు ఈ లీగ్‌లో పోటీ పడ్డారు. అయితే గెలుపు మాత్రం మన హైదరాబాదీ సాహిత్‌ మంగునే వరించింది. గోల్డెన్‌ గావెల్‌ టాప్‌ స్పీకర్‌ అవార్డు దక్కించుకున్నాడు.  సాహిత్‌ డిబెట్‌ న్యాయ నిర్ణేతలను కట్టిపడేసింది. అందుకే సాహిత్‌ను కేవలం విజేతగా మాత్రమే ప్రకటించి అక్కడితో ఆగలేదు. సాహిత్‌ ఎంచుకున్న అంశాలను.. వాటి కోసం అతను చేసిన పరిశోధనను గుర్తించి ప్రత్యేకంగా ప్రశంసించారు కూడా.

సాహిత్‌ మొత్తం నాలుగు అంశలను ఎంచుకొని రేస్‌లోకి దిగాడు. అతను ఎంచుకున్న అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను నిషేధించడం.. అమెరికాలో అందరికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావాలి.. ఫేసియల్‌ టెక్నాలజీ వల్ల చెడు కంటే మంచే ఎక్కువ... శాఖాహారమే మంచిది, మాంసాహారం సరైంది కాదు లాంటీ టాపిక్స్‌ ఎంచుకున్నాడు సాహిత్‌. తన ఫ్రెండ్‌తో కలిపి డిబేట్‌లో పాల్గొన్న సాహిత్ మొత్తం 4 అంశాల్లో నాలుగూ గెలుచుకుని తానేంటో చూపించాడు. నాలుగు అంశాల్లోనూ తన డిబెట్‌తో జడ్జిలను ఫిదా చేశాడు సాహిత్‌. సాహిత్‌ కేవలం ఇంగ్లీష్‌లోనే కాదు.. తెలుగు కూడా చాలా ఫ్లుయింట్‌గా మాట్లడగలడు.. ఇక ఈ అవార్డే కాదు.. అంతకముందు సింగింగ్‌లో కూడా మనోడు అవార్డులు గెలుచుకున్నాడు.

First published:

Tags: America, Hyderabad, India

ఉత్తమ కథలు