హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

August 15: ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవాలు.. ప్రధాని మోదీ జెండా వందనం

August 15: ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవాలు.. ప్రధాని మోదీ జెండా వందనం

జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ (image credit - twitter - ANI)

జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ (image credit - twitter - ANI)

75th Independence Day: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

  75th Independence Day: 75వ స్వాతంత్ర్య దినోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీ... ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉదయం 7-30 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. అంతకుముందు.. రాజ్‌ఘాట్ దగ్గర మహాత్మా గాంధీ సమాధికి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఎర్రకోటకు వెళ్లిన ప్రధానమంత్రికి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్... ఎర్రకోటకు స్వాగతం పలకగా.... త్రివిధ దళాలు... గార్డ్ ఆఫ్ హానర్ ప్రకటించాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ... దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే ఏడాది ఆగస్టు 15వరకూ జరిపే ఆజాదీ కా అమృత మహోత్సవం... ప్రజలకు కొత్త ఎనర్జీ తేవాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.


  ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొన్న 32 అథ్లెట్లు ఎర్రకోట దగ్గర పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనడం విశేషం.

  స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎర్రకోట దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఎంట్రీ దగ్గర షిప్పింగ్ కంటైనర్లు ఉన్నాయి. 350 సీసీ కెమెరాలతో పాటు 2 ప్రత్యేక పోలీసు కంట్రోల్ రూమ్‌లు ఉన్నాయి. ఎర్రకోట దగ్గర 5 వేల మంది సిబ్బందితో భద్రత ఉంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Independence Day 2021

  ఉత్తమ కథలు