• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • 75 YEAR OLD DIABETIC WOMAN BEATS CORONA VIRUS IN 13 DAYS AND HERE IS HER SUCCESS STORY SSR

Diabetic Woman Beats Corona: 24 గంటల కంటే ఎక్కువ బతకదన్నారు.. కరోనాకే చుక్కలు చూపించి..

కరోనాను జయించిన శైలజా నక్వే

ముంబైలోని ఘట్‌కోపర్‌కు చెందిన శైలజ నక్వే వయసు 75 సంవత్సరాలు. వయసు మీద పడిన ఆమె అప్పటికే డయాబెటిక్‌ సమస్యతో బాధపడుతున్నారు. ప్రతిరోజు మందులు వేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆమెకు కరోనా పాజిటివ్‌గా...

  • Share this:
    ముంబై: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న పరిస్థితి నెలకొంది. అయితే.. కరోనా సోకి చనిపోతున్న వారితో పాటు భయంతో చనిపోతున్న వారికి సంబంధించిన ఘటనలు కూడా మన దేశంలో అక్కడక్కడా చోటు చేసుకుంటుండటం శోచనీయం. అదేదో.. సినిమాలో ‘దెయ్యం కంటే భయం మాచెడ్డది’ అని చెప్పినట్లు కరోనా కంటే భయమే మనిషిని మానసికంగా కుంగదీస్తోంది. మానసికంగా బలహీనంగా ఉన్నవారిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రజలంతా ధైర్యంగా ఉండి ఈ కరోనా మహమ్మారితో పోరాడాలి. ఎన్నో వైరస్‌లను తట్టుకుని నిలబడిన మనల్ని కరోనా ఏం చేయలేదు. ప్రజల్లో ఎక్కువగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల గురించి, మరణాల గురించి చర్చ జరుగుతుందే తప్ప పెద్ద సంఖ్యలో కోలుకుంటున్న వారి గురించి.. వాళ్లు ఎలా వైరస్‌ను జయించారనే అంశం గురించి చర్చ జరగడం లేదు. ప్రజల్లో భయాందోళనలకు ఇదొక ప్రధాన కారణం. భారత్‌లో గడచిన 24 గంటల్లో 2,61,162 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

    ఇలా కరోనాను ఇంత మంది జయిస్తుండగా ఎవరికీ ఏ భయం అక్కర్లేదని.. ధైర్యంగా ఉండాలని ముంబైకి చెందిన ఓ 75 ఏళ్ల వృద్ధురాలు చెబుతున్నారు. ముంబైలోని ఘట్‌కోపర్‌కు చెందిన శైలజ నక్వే వయసు 75 సంవత్సరాలు. వయసు మీద పడిన ఆమె అప్పటికే డయాబెటిక్‌ సమస్యతో బాధపడుతున్నారు. ప్రతిరోజు మందులు వేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అసలే డయాబెటిక్ పేషెంట్. పైగా కరోనా అటాక్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు.

    ఇది కూడా చదవండి: IndiaFightsCorona: ఇక కరోనా ఖతమేనా.. ఇది వాడితే కరోనా వైరస్‌కు మూడినట్టేనట..!

    కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యానికి లోనైన ఆమెను కుటుంబ సభ్యులు సోనగ్ర మెడికల్ అండ్ సర్జికల్ సెంటర్‌కు తరలించారు. అప్పటికే ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయని.. 24 గంటల కంటే ఎక్కువ బతికే ఛాన్స్ లేదని శైలజ కొడుకుకు వైద్యులు తేల్చి చెప్పారు. అయినప్పటికీ తమ వంతు ప్రయత్నం చేస్తామని, ధైర్యంగా ఉండాలని ఆమె కొడుకైన ప్రశాంత్ నక్వేకు వైద్యులు చెప్పారు. 75 సంవత్సరాల వయసులో కరోనా బారిన పడిన శైలజకు వైద్యులు చికిత్సలో భాగంగా రెమిడిసివిర్‌తో పాటు కొన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చారు. తన తల్లిని కాపాడుకోవడం కోసం ప్రశాంత్ ఆరు డోస్‌ల రెమిడిసివిర్‌ను వైద్యులకు తెచ్చి ఇవ్వగలిగాడు. వైద్యులు ఆరు డోస్‌ల రెమిడిసివిర్‌ను శైలజకు ఇంజెక్ట్ చేశారు.

    ఇది కూడా చదవండి: Chennai: కరోనా సెకండ్ వేవ్‌కు ఎన్నికల సంఘమే కారణం.. హత్య కేసు పెట్టాలన్న మద్రాస్ హైకోర్టు
     అయితే.. అప్పటికే శైలజ చాలా కష్టంగా ఊపిరి తీసుకుంటున్నారని.. ఆక్సిజన్ వెంటిలేటర్ సాయంతో ఆమె శ్వాస తీసుకున్నారని వైద్యులు తెలిపారు. మొత్తానికి వైద్యుల ప్రయత్నం ఫలించింది. 13 రోజుల వ్యవధిలో శైలజ కరోనా నుంచి కోలుకున్నారు. వైద్యులు ఆమెతో కేక్ కట్ చేయించి సంతోషంగా డిశ్చార్జ్ చేశారు. ఆమెకు వైద్యం అందించిన.. డాక్టర్ రాజారామ్ సోనగ్ర మాట్లాడుతూ.. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని.. అయితే.. ఆమెను డిశ్చార్జ్ చేసినప్పటికీ ఆమెకు ఇంట్లో రెండు లీటర్ల ఆక్సిజన్ సిలిండర్ అవసరమవుతుందని ఆయన చెప్పారు. ఆమె పూర్తిగా కోలుకోవడానికి ఆరు నెలలు పడుతుందని.. అప్పటివరకూ ఆమెను జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందని తెలిపారు.
    Published by:Sambasiva Reddy
    First published: