ఫఫOld woman gives birth to her first child : రాజస్తాన్(Rajasthan) రాష్ట్రంలోని అల్వార్(Alwar) జిల్లాలో 70 ఏళ్ల వృద్ధురాలు పాపకు జన్మనిచ్చింది. మహిళ భర్త వయస్సు 75 సంవత్సరాలు. ఈ జంటకు దాదాపు 54 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇప్పుడు IVF ద్వారా ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. ఈ వయసులో ఓ మహిళ గర్భం దాల్చడంతో చాలా ఆందోళనలు ఉండేవని, చివరికి అంతా సంతోషంగానే ముగిసిందని డాక్టర్ చెప్పారు.
అల్వార్‌లోని ఇండో ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సైంటిఫిక్ డైరెక్టర్, ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ గుప్తా మాట్లాడుతూ... "చంద్రావతి,గోపీ సింగ్ జిల్లాలోని సింఘానా గ్రామ నివాసితులు. చంద్రావతి వయసు 70 ఏళ్లు, గోపీ సింగ్ వయసు 75 ఏళ్లు. గోపీ సింగ్ రిటైర్డ్ సైనికుడు. సైన్యం నుంచి పదవీ విరమణ చేసి 40 ఏళ్లు పూర్తయ్యాయి. బంగ్లాదేశ్ యుద్ధంలో గోపీ సింగ్ కూడా పాల్గొన్నారు. అయితే పెళ్లయ్యాక సంతానం లేదని మనస్తాపానికి గురైన ఈ దంపతులు.. పలు చోట్ల వైద్యం చేయించుకున్నా ప్రయోజనం కనిపించలేదు. ఏడాదిన్నర క్రితం బంధువుల ద్వారా ఇక్కడికి వచ్చాడు. తర్వాత ఇక్కడ చికిత్స ప్రారంభించారు. ఐవీఎఫ్ విధానంలో మూడో ప్రయత్నంలో 9 నెలల క్రితం చంద్రావతి దేవి గర్భం దాల్చింది. ఇంత వయసులో 9 నెలలు బిడ్డను మోయడం వల్ల ప్రసవం సఫలమవుతుందా లేదా అని భయపడ్డాను. అయితే ఎట్టకేలకు సోమవారం అన్నీ సాధ్యమయ్యాయి. చంద్రావతి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాప కూడా ఆరోగ్యంగా ఉంది"అని తెలిపారు.
Asteroid may hit earth: ఆగస్టు 18న భూమిపై విధ్వంసం?..ఓ పెద్ద గ్రహశకలం భూమిని ఢీ కొట్టే అవకాశం!
కొత్త చట్టం జూన్ 2022 నుండి అమలులో
భారత పార్లమెంటు జనవరి 2022లో ఓ చట్టాన్ని ఆమోదించింది. ఇది జూన్ 2022 నుండి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం, ఇప్పుడు ఏ కేంద్రం కూడా 50 ఏళ్లు పైబడిన స్త్రీలు, పురుషులకు వంధ్యత్వానికి IVF చికిత్సను అందించకూడదు. అయితే ఈ చట్టం అమల్లోకి రాకముందే ఈ జంట ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అలా ఈ వయసులో తల్లిదండ్రులు అయ్యారు ఈ వృద్ధ దంపతులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.