హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Friendship: స్నేహమంటే ఇదే! ఫ్రెండ్ కోసం ఏకంగా బావినే తవ్వేశారుగా!

Friendship: స్నేహమంటే ఇదే! ఫ్రెండ్ కోసం ఏకంగా బావినే తవ్వేశారుగా!

జెస్సీ సాబు స్నేహితులు

జెస్సీ సాబు స్నేహితులు

45 ఏళ్ల జెస్సీ సాబు అనే మహిళది అదే పరిస్థితి. కొన్ని దశాబ్దాలుగా నీటి కొరతతో తన జీవితంలో పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు.

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

అది కేరళలోని పతనంతిట్టా! ఎండకాలం వచ్చిందంటే ఆ ఊరిలో మంచినీళ్ల కొరతతో అల్లాడే కుటుంబాలెన్నో.. ! మంచి నీళ్ల ట్యాంకర్ కు డబ్బులు ఖర్చు చేయడం.. వచ్చే సంపాదనంతా ప్రైవేట్ ట్యాంకర్ కే వెళ్లిపోవడం సర్వసాధారణమైన విషయం.. 45 ఏళ్ల జెస్సీ సాబు అనే మహిళది అదే పరిస్థితి. కొన్ని దశాబ్దాలుగా నీటి కొరతతో తన జీవితంలో పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు.. అయితే ఈసారి వేసవిని ఎదుర్కోగలదు... జేసీ సాబు జీవితంలో ఇంత పెద్ద మార్పు వస్తుందని ఆమె కూడ ఎప్పుడూ ఊహించుకోలేదు. తన ఏడుగురు స్నేహితుల వల్ల ఆమె జీవితంలో అతి పెద్ద అడ్డంకిని అధిగమించింది.. ఎలాగో తెలుసా?

7 కి.మీ దూరం వెళ్లి మరి బట్టలు ఉతకాలి:

గత కొన్నేళ్లుగా జేసీ సాబు, ఆమె భర్త తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని నీటి అవసరాలకే ఖర్చు చేస్తున్నారు. అతని కుటుంబం వారంలో 2000 లీటర్ల వాటర్ ట్యాంకర్ కొనడానికి రూ.750 చెల్లించాల్సి వచ్చింది. ఇది మాత్రమే కాదు, కుటుంబం బట్టలు ఉతకడానికి అథియాక్కంలోని పంపా నదికి 7 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వచ్చింది, దీనికి ప్రతి వారం రూ.400 రూపాయలు అవసరం అయ్యేవి. ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కారం ఉంది. అది బావిని తవ్వడం. అయితే దానికి 1.5 నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆర్థికంగా ఇది ఆ కుటుంబానికి అసాధ్యమైన పని.

ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఈ బావిని తామే తవ్వాలని దంపతులు నిర్ణయించుకున్నారు. మార్చి 2న ఈ పనిని ప్రారంభించారు. అయితే ఆ ఇద్దరి వల్ల కాలేదు.. దీంతో ఫ్రెండ్స్ సీన్ లోకి దిగారు.. జేస్సీ దీనస్థితిని చూసి అతని స్నేహితురాలు మరియమ్మ థామస్, లీలమ్మ జోస్, ఉషా కుమారి, లిల్లీ, కొచుమోల్, రెజిమోల్, అను థామస్ ముందుకు వచ్చారు. ఎండకాలం తన కష్టాలు చూసి స్నేహితులు బావి తవ్వేందుకు సహకరించారని.. రోజూ ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4.30 వరకు పని చేసేవాళ్లమన్నారు. ఈ పని ప్రారంభించిన తర్వాత ఈ విషయం వార్డు సభ్యులకు తెలిసింది. పంచాయతీ అధికారులు MNREGA పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఆమోదం తెలిపారు. ఈ పని MNREGA పరిధిలోకి వచ్చిన తర్వాత జేసీ ఫ్రెండ్ సర్కిల్‌కు రోజుకు రూ.311 వేతనం ఇచ్చారు.

నిజానికి మూడు నాలుగు అడుగులు భూమి లోపలికి వెళ్లాక స్నేహితులకు కష్టాలు మొదలయ్యాయి. కింద గట్టి రాళ్లను పగులగొట్టేందుకు నిపుణుల సహాయం తీసుకున్నారు. ఇద్దరు నిపుణులు తమకు సహాయం చేశారని.. మేము వారికి డబ్బు కూడా చెల్లించామన్నారు. మొత్తం 21 రోజుల పాటు బావి తవ్వడానికి శ్రమించారు స్నేహితులు.. చివరికి వారి అలుపెరగని కృషి ఫలించింది.

First published:

Tags: Friendship, Kerala, Summer, WOMAN