బీహార్ (Bihar)లో ఘోర ప్రమాదం జరిగిది. ఇటుకల బట్టీలో భారీ పేలుడు (Bricks kiln Blast) సంభవించింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 22 మంది కూలీలు గాయపడ్డారు. తూర్పు చంపారన్ జిల్లా బరౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రతన్‌సరాయ్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ పనిచేసే కూలీలు మట్టి ఇటుకలను బట్టీలో పేర్చిన తర్వాత.. దానికి నిప్పుపెట్టారు. అనంతరం మంటలు చెలరేగి.. చూస్తుండగానే చిమ్మీ పేలిపోయింది. భారీ పేలుడు సంభవించడంతో పలువురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో ఇటుక బట్టీ యజమాని మహ్మద్ ఇష్రార్ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై సమాచారం అందించిన వెంటనే.. జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పేలుడు అనంతరం.. ఇటుక బట్టీ చుట్టు పక్కల పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో.. అగ్నిమాపక శకటాలతో ఆర్పేశారు.
Bihar | Seven people died, several others were injured due to the explosion in the chimney of the brick kiln in Narirgir of Ramgarhwa PS. Injured were admitted to a hospital. Rescue operation underway. ASP Raxaul, police teams present with SDRF teams at the spot: Motihari Police
— ANI (@ANI) December 24, 2022
ఇటుక బట్టీ పేలుడులో ఏడుగురు చనిపోవడం పట్ల బీహార్ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ నష్టాన్ని భరించే శక్తిని బాధిత కుటుంబాలకు భగవంతుడు ప్రసాదించాలని కోరారు. క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు నితీష్ కుమార్.
पूर्वी चम्पारण जिले के रामगढ़वा थाना क्षेत्र में ईंट-भट्ठे की चिमनी फटने की घटना दुःखद। मृतकों के परिजनों के प्रति गहरी संवेदना है। घायलों का समुचित इलाज कराने का निर्देश दिया है। उनके शीघ्र स्वस्थ होने की कामना है।
— Nitish Kumar (@NitishKumar) December 23, 2022
కాగా, ప్రమాదం జరిగిన ఇటుక బట్టి అనుమతులు లేకుండా నడుస్తోందని అధికారులు గుర్తించారు. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారని మైనింగ్ శాఖ అధికారుల వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎస్‌డీఎం డాక్టర్ ప్రదీప్‌కుమార్ .. విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Bihar News, Blasts