హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మద్యం దొరక్క.. శానిటైజర్ తాగిన కూలీలు.. ఆరోగ్యం విషమించి ఏడుగురు మృతి

మద్యం దొరక్క.. శానిటైజర్ తాగిన కూలీలు.. ఆరోగ్యం విషమించి ఏడుగురు మృతి

ప్రతీకాత్మ చిత్రం

ప్రతీకాత్మ చిత్రం

నాసిక్‌లో ఆక్సీజన్ లీక్, పాల్‌ఘర్‌లో అగ్నిప్రమాదం ఘటనలను మరవక ముందే మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. యావత్మల్‌లో శానిటైజర్ తాగి ఏడుగురు కూలీలు మరణించారు.

కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో మహారాష్ట్రలో కఠినమై లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. నిత్యావసర సరుకులు అమ్మే దుకాణాలు, ఆస్పత్రులు, మెడికల్ షాపులు మినహా అన్నీ మూతపడ్డాయి. లాక్‌డౌన్ వల్ల వైన్ షాప్‌లను మూసివేశారు. ఐతే మద్యానికి బానిసైన కొందరు వ్యక్తులు శానిటైజర్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే జరిగింది. నాసిక్‌లో ఆక్సీజన్ లీక్, పాల్‌ఘర్‌లో అగ్నిప్రమాదం ఘటనలను మరవక ముందే మహారాష్ట్రలో మరో ఘోరం జరిగింది. యావత్మల్ జిల్లాలో శానిటైజర్ తాగి ఒకే గ్రామంలో ఏడుగురు కూలీలు మరణించారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యావత్మల్ జిల్లా వానీ గ్రామంలో కొందరు కూలీలు మద్యానికి బానిసయ్యారు. ఐతే మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధించడంతో వైన్ షాప్‌లు మూతపడ్డాయి. ఎక్కడా మద్యం దొరకడం లేదు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసైన కొందరు కూలీలు శుక్రవారం శానిటైజర్ తాగారు. వీరిలో పలువురికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఐతే చికిత్స పొందుతూ ఏడుగరు మరణించారు. మృతులను దత్త లాంజేవర్, నూతన్ పతారత్కర్, గణేష్ నందేకర్, సంతోష్ మెహర్, సునీల్‌గా గుర్తించారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. కాగా, మహారాష్ట్రలో శుక్రవారం 66,836 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరో 74,045 మంది కోలుకోగా.. 773 మంది చనిపోయారు. తాజా లెక్కలతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 41,61,676కి చేరింది. వీరిలో ఇప్పటికే 34,04, 792 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 63,252 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 6,93,632 యాక్టివ్ కేసులున్నాయి.

First published:

Tags: Hand sanitiser, Lock down, Lockdown, Maharashtra

ఉత్తమ కథలు