హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

విషాదకర ఘటన.. నీళ్లు లేని ప్రదేశంలో పడిన బస్సు.. 7 గురు దుర్మరణం.. ఎక్కడంటే..

విషాదకర ఘటన.. నీళ్లు లేని ప్రదేశంలో పడిన బస్సు.. 7 గురు దుర్మరణం.. ఎక్కడంటే..

నదిలో బోల్తాపడిన బస్సు

నదిలో బోల్తాపడిన బస్సు

Jharkhand: బస్సు వంతెనపై నుంచి వెళ్తుంది. ఈ క్రమంలో రెయిలింగ్ ఒక్కసారిగా విరిగిపోయింది. బస్సు సివాన్నే నదికి కాస్త దూరంలో పడింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Jharkhand, India

జార్ఖండ్‌లో (Jharkhand) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హజారీబాగ్ జిల్లాలో శనివారం దాదాపు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి బ్యాలెన్స్ తప్పి కింద పడింది. ఈ ఘటనలో అక్కడిక్కడే కనీసం ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కాగా, గిరిదిహ్ జిల్లా నుండి రాంచీ వెళ్తున్న బస్సు తతిజారియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సివాన్నే నదిలో వంతెన రెయిలింగ్ విరిగి ఎండిపోయిన ప్రదేశంలో పడటంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ రతన్ చోతే తెలిపారు.

మరికొందరు ప్రయాణికులు బస్సులో చిక్కుకున్నందున సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు మృతి చెందినట్లు హజారీబాగ్‌లోని సదర్ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. కొందరికి తీవ్రగాయాలు కావడంతో మృతుల సంఖ్య పెరగవచ్చు. వారిని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)కు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మెరుగైన చికిత్స కోసం రాంచీకి తరలించనున్నట్లు తెలుస్తోంది.

నది మధ్యలో బస్సు నీటిలో పడి ఉంటే నష్టం మరింత ఎక్కువగా ఉండేదని అధికారి తెలిపారు. కొంత మంది ప్రయాణికులు ఇంకా బస్సులోనే ఇరుక్కుపోయి ఉన్నారని, గ్యాస్ కట్టర్ల సహాయంతో ఎగ్జిట్ పాయింట్ చేసి వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించేందుకు డీఎస్పీ ర్యాంక్ అధికారి, ముగ్గురు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌లను సంఘటనా స్థలానికి నియమించినట్లు ఎస్పీ తెలిపారు. తతిజారియాలో వంతెనపై నుంచి బస్సు పడిపోవడంతో ప్రయాణికులు మృతి చెందడం బాధాకరమని సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, మృతుల కుటుంబాలకు దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతున్నది.  క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు సీఎం ట్విట్ చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా ఉత్తరప్రదేశ్‌(UttarPradesh)లోని అగ్రా జిల్లాలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.

ఓ యువకుడిని 10 రోజుల్లో 5 సార్లు పాము కాటేసింది(Snake Bitten 5 times). అయితే అన్నిసార్లూ ఒకే పాము,ఒకే చోట కాటేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆగ్రా(Agra) జిల్లాలోని మన్‌కేఢా గ్రామానికి చెందిన రామ్ కుమార్ చాహర్ కుమారుడు రజత్ చాహర్(20) డిగ్రీ చదువుతున్నాడు. ఈనెల 6వ తేదీ సాయంత్రం రజత్ చాహర్ ఇంటి బయట వాకింగ్ చేస్తున్న సమయంలో అతడి ఎడమ కాలుపై ఓ పాము కాటేసి వెళ్లిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు చాహర్ ని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 4 గంటలపాటు అతడి పరిస్థితిని పర్యవేక్షించిన అనంతరం పాము కాటు లక్షణాలేవీ కనిపించడం లేదని డాక్టర్లు రజత్​ ను ఇంటికి పంపేశారు. రెండు రోజుల తర్వాత సాయంత్రం పూట ఇంటి బయట ఉన్న బాత్రూమ్ ​కు వెళ్లిన రజత్ ఎడమ కాలిపై మరోసారు అదే పాము కాటేసింది.

రజత్ ​ని హుటాహుటిన ముబారక్​పుర్​ తీసుకెళ్లి, నాటు వైద్యుల దగ్గర ట్రీట్మెంట్ చేయించారు.యినా ఆ పాము రజత్ ని విడిచి పెట్టలేదు. ఈ నెల 11న రజత్ తన ఇంట్లోని ఓ గదిలో ఉండగా అతడి ఎడమ కాలిపై మరోసారు అదే పాము కాటేసింది. వెంటనే అదే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు కుటుంబసభ్యులు. మళ్లీ ఈ నెల 13న బాత్రూమ్​లో ఉండగా ఓసారి, 14న చెప్పులు వేసుకుంటుండగా మరోసారి రజత్​ ను పాము అదే పాము అదే ఎడమకాలిపై కరిచింది. అయితే సమయానికి ట్రీట్మెంట్ అందుతూ రజత్ ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతోందనని అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రజత్ చాహర్ విషయం గురించి తెలిసిన గ్రామస్థులు అతడి ఇంటికెళ్లి పరామర్శిస్తున్నారు. ఈ పాము రజత్ పై పగబట్టిన విషయం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ అయింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Jharkhand, Road accident

ఉత్తమ కథలు