హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఘోరం.. లోయలో పడిన కారు.. 7 గురు దుర్మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి..

ఘోరం.. లోయలో పడిన కారు.. 7 గురు దుర్మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి..

లోయలో పడిపోయిన కారు

లోయలో పడిపోయిన కారు

Jammu kashmir: కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. వెంటనే కారు పూర్తిగా ధ్వంసమైంది. ఘటన స్థలంలోనే ఐదుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Jammu and Kashmir, India

జమ్ముకశ్మీర్ లోని (Jammu kashmir) కిష్త్వార్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్ యూవీ) వెహికిల్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా లోతైన లోయలో అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో స్పాట్ లోనే ఐదుగురు, మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. కాగా, చింగం నుంచి ఛత్రూకు ప్రయాణీకులను తీసుకెళ్తున్న ఎస్‌యూవీ మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో బోండా గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైందని అధికారి తెలిపారు. పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్ అధికారులు అక్కడికి చేరుకున్నారు.


స్థానిక గ్రామస్తులతో కలిసి రెస్క్యూ నిర్వహించారు. ప్రధానంగా వీరంతా.. టీమ్‌లు వాహనం కొండ రహదారి నుండి క్రిందికి పడిపోయిన వెంటనే ఆపరేషన్ ప్రారంభించారు. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారని, మరో ముగ్గురు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కిష్త్వార్, షఫ్కత్ భట్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన "దురదృష్టకరం" అని పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి జిఎం సరూరి కూడా ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అదే విధంగా.. మరణించిన వారి కుటుంబాలకు తక్షణమే ఎక్స్‌గ్రేషియా సహాయం చేయాలని డిమాండ్ చేశారు.


ఇదిలా ఉండగా సింహాలు ఏనుగుకు చుక్కలు చూపించాయి.


అడవిలో ఒక ఏనుగు తమ గుంపునుంచి విడిపోయినట్లుంది. అది మెల్లగా అక్కడ ఉన్న నీటిని తాగడానికి వచ్చింది. అప్పుడు అది అక్కడే ఉన్న ఆకలితో ఉన్న సివంగీల కళ్లలో పడింది. దాదాపు.. డజనుకు పైగా ఆడ సింహాల గుంపు, ఏనుగుపైన దాడిచేశాయి. అంతే కాకుండా.. ఒకదాని తర్వాత.. మరోకటి ఏనుగుపైన ఎక్కి కూర్చున్నాయి. ఏనుగును (Elephant) ఎలాగైన తినేయాలని అవి గుంపులుగా దాడి చేస్తున్నాయి. ఏనుగు కూడా ఏమాత్రం భయపడకుండా సింహాల గుంపును తన చెవులతో భయపెడుతూ... గట్టిగా ఘీంకరిస్తూ అక్కడి నుంచి తరిమేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోను.. ఐఏఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Jammu kashmir, Road accident

ఉత్తమ కథలు