హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

నిమజ్జన వేడుకలో షాకింగ్ ఘటన.. నీటిలో మునిగి 7 గురు దుర్మరణం.. ఎక్కడంటే..

నిమజ్జన వేడుకలో షాకింగ్ ఘటన.. నీటిలో మునిగి 7 గురు దుర్మరణం.. ఎక్కడంటే..

ఘటన జరిగిన ప్రదేశం

ఘటన జరిగిన ప్రదేశం

Haryana: వినాయక నిమజ్జన వేడుకలో షాకింగ్ ఘటన జరిగింది. విగ్రహన్ని నిమజ్జనం చేస్తుండగా 7 గురు నీటిలో మునిగి చనిపోయారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India

హర్యానాలో (Haryana) శుక్రవారం జరిగిన గణేష్ విగ్రహాల నిమజ్జనోత్సవం (Ganesh nimajjanam)  విషాదంగా మారింది. వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వెళ్లిన ఏడుగురు నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన.. హర్యానాలోని రెండు ప్రాంతాలలో జరిగింది. సోనిపట్‌లో ముగ్గురు మృతి చెందగా, మహేంద్రగఢ్‌లో నలుగురు వ్యక్తులు మునిగిపోయారు. ఇదిలా ఉండగా.. ఆగస్ట్ 31న ప్రారంభమైన గణేష్ చతుర్థి, 10 రోజుల సుదీర్ఘ పండుగ ఈరోజు విసర్జన వేడుకతో ముగిసింది. గణేష్ విగ్రహాలను సమీపంలోని నీటి వనరులకు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. భక్తులు పెద్దఎత్తున విగ్రహాలను నిమజ్జనానికి తీసుకెళ్తారు.

అయితే.. సోనిపట్‌లోని మిమార్‌పూర్ ఘాట్ వద్ద తన కుమారుడు, మేనల్లుడితో కలిసి విగ్రహ నిమజ్జనానికి వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి చనిపోయాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మహేంద్రగఢ్ వద్ద, కనీనా-రేవారి రహదారిలో ఉన్న ఝగడోలి గ్రామ సమీపంలోని కాలువపై గణేశ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి వెళ్లిన సుమారు తొమ్మిది మంది వ్యక్తులు బలమైన నీటి ప్రవాహంతో కొట్టుకుపోయారు.

అర్థరాత్రి ఎనిమిది మందిని కాలువలో నుంచి బయటకు తీశారు. వీరిలో నలుగురు చనిపోయారు. కాగా, హర్యానాలోని మహేంద్రగఢ్‌, సోనిపట్‌ జిల్లాల్లో గణపతి నిమజ్జనం సందర్భంగా కాలువలో పడి అనేక మంది అకాల మరణ వార్త హృదయ విదారకంగా ఉందని ముఖ్యమంత్రి ఎంఎల్‌ ఖట్టర్‌ అన్నారు. ఈ కష్టకాలంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటామని సీఎం ఖట్టర్ అన్నారు.

ఇదిలా ఉండగా కర్ణాటకలోని (karnataka)  రాయచూర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది.

సంతే కల్లూరు గ్రామంలోని ఘనమఠేశ్వర గ్రామీణ సంస్థ అనే సంస్థ నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలలో గత శుక్రవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. అఖిత్ అనే 2వ తరగతి చదువుతున్న బాలుడు.. యూనిఫామ్ లోనే మూత్రవిసర్జన చేశాడు. దీంతో ఉపాధ్యాయుడు.. హులిగెప్ప ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే వేడినీళ్ళను తీసుకొచ్చి, బాలుడి మీద గుమ్మరించాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థులంతా భయంతో పారిపోయాడు.

ఇతర సిబ్బంది బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అతనికి 40 శాతం శరీరమంతా కాలిపోయిందిన వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ఘటనపై ఫిర్యాదు చేయోద్దని బాధిత కుటుంబాలను కొంతమంది బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఘటనకు సంబంధించిన బాలుడి ఫోటోలు వైరల్ కావడంతో ఈ అమానుషం వెలుగులోనికి వచ్చింది. ఘటన జరిగినప్పటి నుంచి ఉపాధ్యాయుడు హులిగెప్ప పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సుమోటోగా చర్యలు తీసుకొవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న ఫోటోలు వైరల్‌గా (Viral news)  మారాయి.

Published by:Paresh Inamdar
First published:

Tags: Ganesh immersion, Haryana

ఉత్తమ కథలు