హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Helicopter Crash : కేదార్ నాథ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్..భక్తులు,పైలట్లు మృతి

Helicopter Crash : కేదార్ నాథ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్..భక్తులు,పైలట్లు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌కు భక్తులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్‌ కుప్పకూలింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌కు ఫటా నుంచి భక్తులతో వెళ్తున్న ఓ హెలికాప్టర్‌ బంస్వారా దగ్గర్లోని చట్టి అటవీ ప్రాంతంలో కుప్పకూలింది.టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాఫ్టర్ కుప్పుకూలినట్లు సమాచారం.ఆలయానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లతో పాటు మొత్తం ఆరు మంది ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్‌ కూలిన ప్రదేశంలో భారీగా పొగలు వ్యాపించాయి. చెల్లాచెదురుగా హెలికాప్టర్‌ శిథిలాలు పడి ఉన్నాయి.ఘటనాస్థలికి చేరుకున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ఈ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రతికూల వాతావరణం కారణంగానే హెలికాప్టర్ కుప్పకూలినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ కు మంట అంటుకుని కుప్పకూలినట్లు ఇందుకు సంబంధించిన దృశ్యాల ద్వారా తెలుస్తోంది.మంటల్లో కాలిపోతున్న హెలికాప్టర్‌ శకలాలు దృశ్యాలను కొందరు తమ కెమెరాల్లో తీశారు.

కాగా,ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌ ఉన్న విషయం తెలిసిందే. సాధారణంగా వేసవి కాలం నుంచి ఆలయం దర్శనం కోసం తెరి ఉంచుతారు. దీపావళి వరకు ఈ ఆలయంలో భక్తులకు దర్శనాలు ఉంటాయి. అయితే ట్రెక్కింగ్ చేయలేని భక్తుల కోసం.హెలికాప్టర్‌ సేవలు అక్కడ అందుబాటులో ఉంటాయి.

First published:

Tags: Crime news, Uttarakhand

ఉత్తమ కథలు