హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

సుప్రీంకోర్టు ఫుల్ బిజీ... శబరిమల సహా 7 కేసులు...

సుప్రీంకోర్టు ఫుల్ బిజీ... శబరిమల సహా 7 కేసులు...

ఈ నేపథ్యంలో కేసును సీబీఐకు అప్పగించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఈ నేపథ్యంలో కేసును సీబీఐకు అప్పగించాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది.

Supreme Court : సుప్రీంకోర్టు జడ్జిలకు శీతాకాల సెలవులు అయిపోయాయి. ఇవాళ తిరిగి ప్రారంభమవుతున్న అత్యున్నత న్యాయస్థానంలో జనవరిలో విచారణకు వచ్చే 7 కేసులేంటో చకచకా తెలుసుకుందాం.

  Supreme Court : ఒకప్పుడు సుప్రీంకోర్టు కేసులంటే బోర్ కొట్టే పరిస్థితి. ఇప్పుడలా కాదు. అత్యున్నత న్యాయస్థానం ఏ కేసులో ఏ తీర్పు ఇస్తుందా అని దేశ ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు. దానికి తోడు ఇప్పటి జడ్జిలు కూడా వాయిదాలు వేస్తూ... సాగదీయకుండా... విషయాన్ని ఫటాఫట్ తేల్చేస్తున్నారు. అందువల్లే ఇటీవల సంచలన తీర్పుల్ని మనం వింటున్నాం. స్కూళ్లకు వేసవి సెలవులు ఎలాగో... సుప్రీంకోర్టుకు శీతాకాలం సెలవులు అలాగ. 15 రోజుల బ్రేక్ తర్వాత... సుప్రీంకోర్టు ఇవాళ రీ-ఓపెన్ అవుతోంది. ఇలా తెరచుకుంటుందో లేదో... అలా కేసుల ఫైళ్లు... టేబుల్‌పై దర్శనమిస్తాయి. ఓ టీ తాగి... ఒక్కో కేసు సంగతీ చూసేయడమే. ముందుగా ఇవాళ శబరిమల కేసును విచారించే అవకాశాలున్నాయి.

  సుప్రీంకోర్టులో జనవరిలో విచారణకు వచ్చే కేసులు :

  1. శబరిమల రివ్యూ పిటిషన్ : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలూ వెళ్లొచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును... ఏడుగురు సభ్యుల ధర్మాసనం పరిశీలించనుంది. మతపరమైన అంశంపై ఇచ్చిన తీర్పు కావడంతో... దీనిపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఈ కేసుతోపాటూ... ఇలాంటివే మరికొన్ని లింకై ఉన్నాయి. మసీదుల్లోకి ముస్లిం మహిళల ఎంట్రీ, పార్శీ మహిళలు... పార్శీ కాని వారిని పెళ్లి చేసుకోవడం వంటివి కూడా ఏడుగురు సభ్యుల ధర్మాసనం పరిశీలించే అవకాశాలున్నాయి.

  2. జమ్మూకాశ్మీర్ ప్రత్యేక హోదా : ఆర్టికల్ 370ని రద్దు చేసి... జమ్మూకాశ్మీర్‌ను రెండుగా చేసి... లడక్, జమ్మూకాశ్మీర్... కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఆర్టికల్ 370ని కేంద్రం ఎలా రద్దు చేస్తుందని చాలా మంది పిటిషన్లు వేశారు. వీటిపై జనవరి 21న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

  3. పౌరసత్వం సంగతేంటి? : కేంద్రం ఇటీవల తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (CAA)ను వ్యతిరేకిస్తూ దాదాపు 60 పిటిషన్లు ఉన్నా్యి. ఈ చట్టం రాజ్యాంగ బద్ధమైనది కాదని పిటిషన్ దార్లు అభిప్రాయపడుతున్నారు. దీన్ని రద్దు చెయ్యాలని కోరుతున్నారు. ఈ మేటర్‌ను జనవరి 22న సుప్రీంకోర్టు విచారించనుంది.

  4. ఎలక్టొరల్ బాండ్స్ : ఎలక్టొరల్ బాండ్స్ అమ్మడం ద్వారా... రాజకీయ పార్టీలు డొనేషన్లు పొందవచ్చంటూ... 2018 జనవరిలో తెచ్చిన స్కీంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును కూడా జనవరిలో పరిశీలించనున్నారు. ఈ స్కీం ద్వారా రూ.6000 కోట్లను రాజకీయ పార్టీలు సంపాదించాయనే వాదన ఉంది.

  5. రోహింగ్యాల పరిస్థితి : రోహింగ్యా శరణార్థులు పెట్టుకున్న పిటిషన్లను జనవరి 10న సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది. మయన్మార్ నుంచీ పారిపోయి... మన దేశంలో తలదాచుకుంటన్న రోహింగ్యాలు... జమ్మూ, హైదరాబాద్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్‌లో ఉంటున్నారు. వాళ్లను తిరిగి మయన్మార్ పంపించేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. దీనిపై రోహింగ్యాలు అభ్యంతరం చెబుతున్నారు.

  6.మరాఠా కోటా : మహారాష్ట్రలో మరాఠా వర్గాలకు ఉద్యోగాలు, విద్యలో అక్కడి ప్రభుత్వం కోటా ఇవ్వడాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. దీన్ని వ్యతిరేకిస్తూ... సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసు జనవరి 22న విచారణకు రానుంది.

  7. బీసీసీఐ కేసులు : బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (BCCI)కి సంబంధించి కొన్ని కేసులున్నాయి. వాటన్నింటినీ జనవరిలోనే వించారించాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. BCCI ఆఫీస్ బీరర్లకు సంబంధించి... లోథా కమిటీ వేసిన సిఫార్సులను అమలు చేసేందుకు BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రయత్నిస్తున్నారు. వీటిపై సుప్రీంకోర్టు అభిప్రాయం తెలుసుకోనుంది.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Bcci, CAA, Sabarimala, Supreme Court

  ఉత్తమ కథలు