నేడు ఆరో దశ... 6 రాష్ట్రాల్లో 59 స్థానాలకు పోలింగ్... బరిలో 979 అభ్యర్థులు...

ప్రతీకాత్మక చిత్రం

6th Phase Lok Sabha Election 2019 : ఇప్పటివరకూ దాదాపు 400 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఆరో దశలో బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, హర్యానా రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి.

  • Share this:
6th Phase Lok Sabha Election 2019 : ఆరో దశలో 10 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు. ఢిల్లీ, హర్యానాలో ఆసక్తికర పోరు ఉంది. 6 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం 59 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 979 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటివరకూ దాదాపు 400 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఆరో దశలో బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, హర్యానా రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు త్రిపురలో వెస్ట్‌ త్రిపుర నియోజకవర్గంలో 168 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ జరుగుతుంది. ఈ దశ కోసం 59 స్థానాల్లో లక్షా 13 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు అమర్చారు. బీహార్‌లో 8, హర్యానాలో 10 (మొత్తం స్థానాలు), జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్‌లో 8, ఢిల్లీలోని మొత్తం 7 లోక్ సభ స్థానాలకూ ఆరో దశలో పోలింగ్ జరుగుతుంది.

ఈ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీల నేతలు విస్తృత ప్రచారం చేశారు. ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీపార్టీ, బీజేపీ, కాంగ్రెస్ తలపడుతుంటే... హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్, ఐఎన్ఎల్డీ పోటీ పడుతున్నాయి.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బీజేపీ అభ్యర్ధి, వివాదాస్పద సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌తో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్ సింగ్‌ తలపడుతున్నారు. ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌పై ఉగ్రవాద చర్యలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గంలో జ్యోతిరాధిత్య సింథియా కాంగ్రెస్‌ తరపున బరిలో దిగారు.

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌ పూర్‌ నియోజకవర్గంలో బీజేపీ తరపున కేంద్ర మంత్రి మేనకా గాంధీ గత ఎన్నికల్లో గెలిచారు. ఈసారి ఆమె కొడుకు వరుణ్‌ గాంధీ ఇక్కడి నుంచీ బరిలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది. బీజేపీ, కాంగ్రెస్‌తో పాటూ ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి తమ అభ్యర్థని బరిలోకి దింపింది.

ఈస్ట్‌ ఢిల్లీలో త్రిముఖ పోటీ ఉంది. ఆమ్‌ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ తరపున అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు. బీజేపీ తరపున క్రికెటర్‌ గౌతం గంభీర్‌, ఆప్‌ తరపున అతిషి, కాంగ్రెస్‌ తరపున అరవిందర్‌ సింగ్‌ లవ్లీ బరిలో ఉన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని బంకుర నియోజకవర్గం నుంచి సీపీఎం తరపున 1980 నుంచీ బాసుదేవ్‌ ఆచార్య గెలుస్తున్నారు. 2014లో మాత్రం తృణముల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మున్‌మున్‌ సేన్‌ గెలిచారు. ఈసారి ఆమె మరో స్థానం నుంచి బరిలోకి దిగారు. ప్రస్తుతం బంకుర నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ ఉంది. సీపీఎం, టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు విస్తృత ప్రచారం చేశారు.

జార్ఖండ్‌లో ధన్‌బాద్‌ నుంచి క్రికెటర్‌, బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ కీర్తి ఆజాద్‌ ఆ పార్టీకి రాజీనామా చేసి, ఈసారి కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్నారు. ఇలా ఈ దశలో ప్రాంతీయ పార్టీలు గట్టి పోటీ ఇస్తుండటంతో ఇవి ఎక్కువ ఆసక్తి కలిగిస్తున్నాయి.

 

ఇవి కూడా చదవండి :

బ్యాలెన్స్ ఫార్ములాతో లగడపాటి సర్వే... వైసీపీ షాక్ ఇస్తుందా...?

ఇంటర్‌ బోర్డు నుంచి గ్లోబరీనా ఔట్... కొత్త సంస్థకు సప్లిమెంటరీ ఫలితాల బాధ్యత

మాజీ ప్రియుడి బ్లాక్‌మెయిల్... ఓ యువతి ఆవేదన...

వరల్డ్ టాప్ 10 ఎయిర్‌పోర్ట్స్ ఇవే... శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి 8వ స్థానం
First published: