Shocking: పిడుగుపాట్లకు 68 మంది బలి... ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక ప్రకటన

పిడుగుపాట్లకు 68 మంది బలి

Shocking: రోడ్డు ప్రమాదాలు, కరోనాయే కాదు... పిడుగులు కూడా చాలా మందిని చంపేస్తున్నాయి. ఇలాగైతే ఎలా... ఇక మనకు రక్షణ ఎక్కడ? ఆ మూడు రాష్ట్రాల్లో ఎందుకీ పరిస్థితి వచ్చింది?

  • Share this:
    Shocking: పిడుగులు ప్రాణాలు తీసేస్తున్నాయి. రోజురోజుకూ పిడుగుపాటు మరణాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకూ పిడుగులు పడి... ఉత్తరప్రదేశ్‌లో 41 మంది చనిపోగా... మధ్యప్రదేశ్‌లో ఏడుగురు, రాజస్థాన్‌లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ 20 మందిలో ఏడుగురు పిల్లలు ఉన్నారు. వీరంతా కోటా, దోల్పూర్ జిల్లాలకు చెందినవారు. ఈ మరణాల సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో పడిన పిడుగుల వల్ల ఇంత మంది చనిపోయారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్... వెంటనే బాధితులకు తగిన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు.

    ఈ ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమన్న ఆయన... మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రూ.2 చొప్పున పరిహారం ప్రకటించారు.


    మృతులే కాదు... గాయపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది. రాజస్థాన్‌లో 17 మంది దాకా గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ హాస్పిటల్‌కి తరలించింది రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం (SDRF). గాయపడినవారిని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ... మూడు రాష్ట్రాల్లో గాయపడిన వారికి రూ.50,000 పరిహారం ప్రకటించారు. అటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్... మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.



    ఇది కూడా చదవండి: Cryptogamic garden: దేశంలో మొదటి పుట్టగొడుగుల గార్డెన్ ప్రారంభం.. ఇవీ ప్రత్యేకతలు

    మన తెలుగు రాష్ట్రాల్లో నైరుతీ రుతుపవనాలు మరీ అంత ఎక్కువగా ప్రభావం చూపట్లేదు గానీ... ఉత్తర భారత్‌లోని రాష్ట్రాల్లో మాత్రం కుండపోత వానలు కురుస్తున్నాయి. నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అక్కడ చాలా చోట్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. వాటిలో రాపిడి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ మేఘాలు ఉన్నచోట... ఉరుములు, మెరుపులు, పిడుగులూ ఎక్కువగా ఉంటాయి. సడెన్‌గా పడే పిడుగుల నుంచి తప్పించుకోవడం ఎవరి వల్లా కాదు. అందువల్లే మృతుల సంఖ్య పెరిగిపోతోంది. జైపూర్‌లోని అమెర్ ఏరియాలో... ఓ వాచ్ టవర్‌పై 40 నిమిషాల గ్యాప్‌లో రెండుసార్లు పిడుగులు పడ్డాయి. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published: