UDISE+ Survey : దేశంలో కేంద్ర ప్రభుత్వం నూతన ఎడ్యుకేషన్ పాలసీని(New Education Policy) తీసుకొచ్చింది. బోధనలో రావాల్సిన మార్పులు, టెక్నాలజీ వినియోగం ఆవశ్యకతను తెలియజేసింది. అయితే దేశంలో ఇప్పటికీ చాలా పాఠశాలల్లో సరైన ఇంటర్నెట్ సదుపాయం లేదు. ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్స్‌లో ఇంటర్నెట్ సౌకర్యంపై ఓ సంస్థ చేపట్టిన సర్వే స్పష్టం చేస్తోంది. దేశంలో కేవలం 66 శాతం విద్యా సంస్థలకు మాత్రమే ఇంటర్నెట్ కనెక్టివిటీ సదుపాయం ఉందని సర్వేలో తెలింది. ఇప్పుడు ఆ సర్వే పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఈ రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే తక్కువ
యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (UDISE+) 2021-22లో ఈ సర్వే చేపట్టింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, జమ్ము కాశ్మీర్, పశ్చిమ బెంగాల్ , మేఘాలయ, ఒడిశా, తెలంగాణ , త్రిపుర వంటి రాష్ట్రాల్లో 80–85 శాతం కంటే తక్కువగా ఇంటర్నెట్ యాక్సెస్ ఉందని పేర్కొంది. ఇది జాతీయ సగటు కంటే తక్కువగా ఉండడం గమనార్హం. బీహార్, మిజోరాం వంటి రాష్ట్రాలలో పరిస్థితి మరింత అధ్వానంగా ఉందని తెలిపింది.
మొదటి రెండు స్థానాల్లో కేరళ , గుజరాత్
స్కూల్స్‌లో ఇంటర్నెట్ సదుపాయం ఉన్న టాప్ రాష్ట్రాలుగా కేరళ, గుజరాత్ నిలిచాయి. వరుసగా 94.6 శాతం, 92 శాతం చొప్పున ఈ రెండు రాష్ట్రాలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. గుజరాత్లో ప్రైవేట్ స్కూల్స్‌లో 89.6 శాతం ఇంటర్నెట్ సదుపాయం ఉండగా.. ప్రభుత్వ బడుల్లో 94.2 శాతంగా ఉండటం గమనార్హం.
New Rules: నేటి నుంచి 7 కొత్త రూల్స్... మీ డబ్బుపై ప్రభావం చూపించేవి ఇవే
ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ మధ్య భారీ అంతరం
ఇంటర్నెట్ సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉందని సర్వే పేర్కొంది. కేవలం 24.2 శాతం ప్రభుత్వ బడుల్లో మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉండగా, ప్రైవేట్ స్కూల్స్‌లో 59.6 శాతం, అన్ ఎయిడెడ్, గర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లలో కేవలం 53.1 శాతం ఉంది. సర్వే చేసిన పాఠశాలల్లో సగం కంటే తక్కువ స్కూల్స్‌లోనే ఫంక్షనల్ కంప్యూటర్స్ ఉన్నాయి. వీటిలో కేవలం 20% మాత్రమే బోధనా ప్రయోజనాల కోసం ఫంక్షనల్ మొబైల్ ఫోన్స్ యాక్సెస్ కలిగి ఉన్నాయి.
యూటీల్లో ఢిల్లీ టాప్
పాఠశాల విద్యపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కలెక్ట్ చేసిన డేటా ఆధారంగా సర్వే పలు కీలక విషయాలు వెల్లడించింది. ఢిల్లీ, లక్షదీప్లలో 100 శాతం పాఠశాలల్లో సరైన కంప్యూటర్ సదుపాయాలు ఉన్నాయని.. 97.4 శాతం పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉందని పేర్కొంది. అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఏకైక కేంద్ర పాలిత ప్రాంతం(UT)గా ఢిల్లీ రికార్డ్ సృష్టించింది. ఇక చండీగఢ్ 98.7%, పుదుచ్చేరి 98.4%తో తరువాతి స్థానాల్లో నిలిచాయి.
ఏటా పెరుగుతున్న సంఖ్య
గత నాలుగేళ్లలో భారతదేశంలో మొత్తం పాఠశాలల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఇంటర్నెట్ సదుపాయం ఉన్న స్కూల్స్ ఏటేటా పెరుగుతున్నాయి. 2018-19లో 15,51,000 స్కూల్స్ ఉండగా, 2021-22లో 14,89,115కు తగ్గాయి. అయితే ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పాఠశాలల సంఖ్య 2018-19లో 2,90,447 ఉండగా, 2021-22లో ఈ సంఖ్య 5,04,989కు పెరిగింది. దేశంలో 1.4 మిలియన్ పాఠశాలలు ఉండగా, కేవలం 2,22,155 పాఠశాలల్లో మాత్రమే బోధన కోసం డిజిటల్ లేదా స్మార్ట్ క్లాస్‌రూముల ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Internet, Telangana schools