హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Breaking News: కల్తీ కాఫ్ సిరప్ తాగి 66 మంది పిల్లలు మృతి..ఇండియా నుంచే సరఫరా..అన్ని దేశాలను అలెర్ట్ చేసిన WHO

Breaking News: కల్తీ కాఫ్ సిరప్ తాగి 66 మంది పిల్లలు మృతి..ఇండియా నుంచే సరఫరా..అన్ని దేశాలను అలెర్ట్ చేసిన WHO

4 రకాల కల్తీ కాఫ్ సిరప్ లు 66 మంది పిల్లల పాలిట మృత్యుపాశాలుగా మారాయి. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని గాంబియాలో ఈ విషాద ఘటన జరిగింది.

4 రకాల కల్తీ కాఫ్ సిరప్ లు 66 మంది పిల్లల పాలిట మృత్యుపాశాలుగా మారాయి. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని గాంబియాలో ఈ విషాద ఘటన జరిగింది.

4 రకాల కల్తీ కాఫ్ సిరప్ లు 66 మంది పిల్లల పాలిట మృత్యుపాశాలుగా మారాయి. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని గాంబియాలో ఈ విషాద ఘటన జరిగింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  4 రకాల కల్తీ కాఫ్ సిరప్ లు (cough syrup) 66 మంది పిల్లల పాలిట మృత్యుపాశాలుగా మారాయి. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని గాంబియాలో ఈ విషాద ఘటన జరిగింది. ఈ సిరప్ లు భారత్ కు చెందిన కంపెనీల నుండే సరఫరా చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. దగ్గు, జలుబు కోసం ఇచ్చే ఈ మందు తాగి 66 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనపై WHO (world health organisation) సీరియస్ అయింది. ఈ నాలుగు సిరప్ లపై డబ్ల్యూహెచ్.ఓ మెడికల్ అలర్ట్ జారీ చేస్తూ సమగ్ర విచారణకు ఆదేశించింది.

  ఆ నాలుగు సిరప్ లు ఇవే..

  చిన్నారుల ప్రాణాలు తీసిన సిరప్ లలో ప్రొమేథాజైన్ ఓరల్ సొల్యూషన్, కొఫెక్స్ మాలిన్ బేబీ కాఫ్ సిరప్, మెకాఫ్ బేబీ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ లు ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువ మొత్తంలో డైఇథిలీన్ రైగ్లేకోల్, ఇథిలీన్ రైగ్లేకోల్ ఉండడమే మరణానికి కారణమని తెలుస్తుంది. వీటి పరిమితి ఎక్కువైతే విషపూరితంగా మారుతుందని మెడికల్ ప్రోడక్ట్ అలెర్ట్ లో పేర్కొంది. ఇక దీనికి సంబంధించి భారత రెగ్యులేటరీ అధికారులతో కలిసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్బంగా కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. వీటి ఉత్పత్తులు సురక్షితం కాదని, అందుకే వీటిని గుర్తించి అమ్మకాల నుండి తప్పించాలని సూచించింది. మరోవైపు చిన్నారుల మరణంపై స్పందిచేందుకు మైడెన్ ఫార్మా సంస్థ నిరాకరించింది.

  ఇతర దేశాలకు సరఫరా..

  ఈ సిరప్ లను (cough syrup) హరియాణా కేంద్రంగా పని చేసే మెయిడెన్ ఫార్మా సూటికల్స్ లిమిటెడ్ తయారు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై WHO (world health organisation)డైరెక్టర్ జనరల్ తెడ్రోస్ అధనోమ్ స్పందించారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మరణించిన పిల్లల కుటుంబీకుల బాధ వర్ణనాతీతం. వీటి ఉత్పత్తిలో భద్రతా, నాణ్యతా వంటి ప్రమాణాలపై తమకు తగిన ఆధారాలు సమర్పించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక వీటిపై ఆయా సంస్థలు క్లియరెన్స్ ఇచ్చే వరకు హానికరమైన ఔషధాలుగానే పరిగణించాలని సూచించింది. అయితే ఈ సిరప్ లను ఇంకా వేరే దేశాలకు సరఫరా చేశారని తెలుస్తుంది. దీనితో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అలర్ట్ చేసింది. ఎవరు ఈ నాలుగు సిరప్ లను (cough syrup) వాడొద్దని ఆదేశించింది.

  Published by:Rajashekar Konda
  First published:

  ఉత్తమ కథలు