Home /News /national /

63 INDIAN CITIES IN 100 MOST POLLUTED PLACES ON EARTH PVN

Pollution : అన్ని ర్యాంకులు మనకే..ప్రపంచంలోని 100 కాలుష్య నగరాల్లో 63 భారత్ లోనే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

World Air Quality Report : దేశంలో కాలుష్య పరిస్థితులు నానాటికీ మరింత దిగజారుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ సహా ఉత్తర భారతంలో కాలుష్య స్థాయిలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. భారత్ లో వాయు కాలుష్యం గతంతో పోలిస్తే మరింతగా దిగజారిందని స్విస్‌ ఐక్యూఎయిర్ తాజాగా​ విడుదల చేసిన "ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2021" తెలిపింది.

ఇంకా చదవండి ...
Most Polluted Places On Earth : దేశంలో కాలుష్య పరిస్థితులు నానాటికీ మరింత దిగజారుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ సహా ఉత్తర భారతంలో కాలుష్య స్థాయిలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. భారత్ లో వాయు కాలుష్యం గతంతో పోలిస్తే మరింతగా దిగజారిందని స్విస్‌ ఐక్యూఎయిర్ తాజాగా​ విడుదల చేసిన "ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2021" తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచంలో వాయు కాలుష్యం అధికంగా ఉన్న 100 నగరాల్లో భారత్‌ లోనే 63 ఉండటం గమనార్హం. ప్రాణాంతక, మైక్రోస్కోపిక్ PM2.5 కాలుష్య కారకాలలో సగటు వాయు కాలుష్యం క్యూబిక్ మీటరుకు 58.1 మైక్రోగ్రాములు.. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వాయు నాణ్యత మార్గదర్శకాల కంటే 10 రెట్లు ఎక్కువ. భారతదేశంలోని ఏ నగరమూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన గాలి నాణ్యత ప్రమాణాలను చేరుకోలేకపోయిందని నివేదిక తెలిపింది.

ఇక, ఈ రిపోర్ట్ ప్రకారం..ప్రపంచంలో అత్యంత కాలుష్య రాజధానుల జాబితాలోఢిల్లీ వరుసగా రెండో ఏడాది మొదటి స్థానంలో నిలిచింది. ముందు ఏడాదితో పోల్చితే ఢిల్లీలో 2021లో 15 శాతం మేర కాలుష్యం పెరిగింది. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల కంటే ఢిల్లీలో వాయు కాలుష్యం దాదాపు 20 రెట్లు అధికంగా ఉంది. ఈ జాబితాలో ఢిల్లీ తర్వాత బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా రెండో స్థానంలో ఉంది.

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో రాజస్థాన్‌లోని భివాండీ తొలిస్తానంలో ఉండగా.. ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్ రెండో స్థానంలో, చైనా నగరం హోటన్ మూడో స్థానంలో,ఢిల్లీ నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలోని టాప్ 15లోని 10 భారతీయ నగరాలు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. మొత్తం 63 నగరాలు ఉండగా.. సగానికి కంటే ఎక్కువ హరియాణా, ఉత్తర్ ప్రదేశ్‌లకు చెందినవే కావడం గమనార్హం. టాప్ 15లో ఒకటి చైనా(హోటన్‌ నగరం), నాలుగు పాకిస్తాన్(ఫైసలాబాద్‌, బహవల్‌పూర్‌, పెషావర్‌, లాహోర్‌), మిగతా 10 భారతీయ నగరాలే కావడం గమనార్హం.కాగా,వాహనాలు, బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు, పారిశ్రామిక వ్యర్థాలు, నిర్మాణ రంగం సహా పలు కారకాలు ఢిల్లీలో వాయు కాలుష్యానికి మూలాలుగా ఉన్నాయి.

ALSO READ The Kashmir Files collections: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ కలెక్షన్స్.. కొత్త చరిత్ర.. 200 కోట్ల వైపు అడుగులు..

గతేడాది నవంబరులో మొట్టమొదటిసారి ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంతో చాలా పరిశ్రమలను తాత్కాలికంగా మూసివేశారు. వాయు కాలుష్యం ప్రజారోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. కాలుష్యంతో ప్రతి నిమిషానికి ముగ్గురు ప్రాణాలు కోల్పోతుంటే.. గుండె, ఊపిరితిత్తుల వ్యాధుల సహా అనేక అనారోగ్య సమస్యలతో జనం సతమతమవుతున్నారు. గతేడాది చెన్నై మినహా ఆరు మెట్రో నగరాల్లో కాలుష్య స్థాయిలు పెరిగాయి.భారత్‌లో ఈ వాయుకాలుష్యం సంక్షోభం విలువ ఏటా 150 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు అంచనా.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Air Pollution, Delhi, India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు