హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

OMG: వీల్ చైర్ లో తీసుకెళ్లి కన్న తల్లికి అంతిమ సంస్కారాలు.. ఎక్కడంటే..

OMG: వీల్ చైర్ లో తీసుకెళ్లి కన్న తల్లికి అంతిమ సంస్కారాలు.. ఎక్కడంటే..

చనిపోయిన తల్లిని తీసుకెళ్తున్న మురుగానందం

చనిపోయిన తల్లిని తీసుకెళ్తున్న మురుగానందం

Tamil nadu: కన్నతల్లి కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో డాక్టర్ లు లాభం లేదని ఇంటికి తీసుకెళ్లమన్నారు. ఇంతలో విషాదరకర సంఘటన జరిగింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Tamil Nadu, India

కొందరు ఇప్పటికి పేదరికంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలాంటి సందర్భాలలో ఏదైన వ్యాధి సోకితే.. వైద్యంచేయించుకులేక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. సర్కారు దవాఖానాకు వెళ్లిన సరిగ్గా పట్టించుకునే వారు కరువయ్యారు. ఈ క్రమంలో కొందరు.. అనుకొని సంఘటనల్లో చనిపోయిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కోవకు చెందిన విషాదకర ఘటన వార్తలలో నిలిచింది.పూర్తి వివరాలు.. తమిళనాడులోని (Tamil nadu) తిరుచ్చిలో దారుణం జరిగింది. స్థానికంగా మనప్పారై ప్రాంతంలో ఉండే మురుగానందం అనే వ్యక్తి , రాజేశ్వరి (84) సోరియాసిస్‌తో తల్లి కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురైంది. ఆమెను ఎన్నిఆస్పత్రులకు తీసుకెళ్లిన లాభం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా ఆమె ఇంటికి తీసుకొచ్చాడు. అతను ఎలక్ట్రిషియన్ ఉద్యోగం చేస్తుంటాడు. ఈక్రమంలో తల్లికి ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు. అయితే.. తల్లి అనుకోకుండా దుర్మరణం చెందింది. కేవలం చిన్నపాటి ఉద్యోగం చేసే.. మురుగానందంకు డబ్బులు వైద్యం కోసం అయిపోయాయి.


కనీసం అంతిమ సంస్కారాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఎదురైంది. అప్పుడు అతను వీల్ చైర్ లోనే చనిపోయిన తల్లిని కూర్చుండబెట్టుకుని స్మశాన వాటికకు తీసుకెళ్లాడు. దీంతో ఇది చూసిన వారంతా చలించిపోయారు. ఈ క్రమంలో.. కొందరు కార్పోరేషన్ సిబ్బంది, ఎన్జీవో లు అతనికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆ తర్వాత.. రాజేశ్వరికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఆమెకు భర్త పెరియసామి (90), మురుగానందం కాకుండా మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటన చూపరులను కన్నీరు పెట్టిస్తుంది.
ఇదిలా ఉండగా బీహార్ లో (Bihar) దారుణ ఘటన జరిగింది.
ముజఫర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. మోతీపూర్ గ్రామానికి చెందిన 10 వ తరగతి చెందిన బాలికను, ఒక యువకుడు నిత్యం వేధించేవాడు. అతను విద్యుత్ శాఖలో పనిచేస్తున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో బాలికను ఒకరోజు గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఎవరికైన చెబితే.. రెండు లక్షల బిల్లు మీ ఇంటికి పంపుతానని బాలికను బెదిరించాడు. దీంతో బాలిక భయాందోళనలకు గురైంది. అతని బెదిరింపులకు క్రమంగా ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Death, Tamil nadu, VIRAL NEWS

ఉత్తమ కథలు