హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

హాస్టల్‌లో స్నానం చేస్తుండగా వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో వైరల్.. ఒకేసారి 8 మంది విద్యార్థినుల ఆత్మాహత్యాయత్నం

హాస్టల్‌లో స్నానం చేస్తుండగా వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో వైరల్.. ఒకేసారి 8 మంది విద్యార్థినుల ఆత్మాహత్యాయత్నం

విద్యార్థినులను ఆస్పత్రికి తరలింపు

విద్యార్థినులను ఆస్పత్రికి తరలింపు

Chandigarh University: శనివారం అర్ధరాత్రి తర్వాత.. చండీగఢ్ యూనివర్సిటీని చుట్టుముట్టి 'వి వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు. ఐతే వీడియో తీసిన అమ్మాయిపై దాడి జరగకుండా హాస్టల్‌లోని ఓ గదిలో బంధించినట్లు సమాచారం. విద్యార్థుల ఆందోళనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  పంజాబ్‌ (Punjab)లోని చండీగఢ్ యూనివర్సిటీ (Chandigarh University)లో తీవ్ర కలకలం రేగింది. బాలికల హాస్టల్‌లో విద్యార్థినులు స్నానం చేస్తుండగా ఓ యువతి వీడియో తీసింది. వాటిని తన బాయ్ ఫ్రెండ్‌కి పంపించడంతో.. అతడు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశాడు. తమ వీడియో పోర్న్ సైట్లలో ప్రత్యక్షం కావడంతో.. ఆ విద్యార్థినులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అవమాన భారంతో ఒకేసారి 8 మంది విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వర్సిటీలో ఉన్న విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు (Students Protest) చేస్తున్నారు.

  మొహాలీ (Mohali)లోని చండీగఢ్ యూనివర్శిటీలో శనివారం ఈ షాకింగ్ ఘటన జరిగింది. బాలికల హాస్టల్‌లో అమ్మాయిలు స్నానం చేస్తుండగా.. మరో యువతి వీడియో తీసింది. ఒక్కరు కాదు.. ఇద్దరివి కాదు.. ఏకంగా 60 మంది అమ్మాయిల స్నానం వీడియోలను మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించింది. వాటిని సిమ్లాలో ఉండే ఓ యువకుడికి పంపించింది. అతడు వాటి సోషల్ మీడియో పోస్ట్ చేసి వైరల్ చేశాడు. పోర్న్ సైట్లలోనూ అప్‌లోడ్ చేశాడు. ఆ వీడియోల గురించి విద్యార్థినులకు తెలియడంతో మనస్థాపానికి గురయ్యారు. ఇంటర్నెట్‌లో వీడియోలు చూసి వణికిపోయారు. తమ పరువు పోయిందని ఎంతో కుంగిపోయారు. ఈ క్రమంలోనే ఆత్మాహత్యాయత్నం చేశారు. ఎనిమింది మంది విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్ చేశారని యూనివర్సిటీ విద్యార్థులు తెలిపారు.

  ఈ విషయంపై యూనివర్సిటీ అధికారుకలు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు వాపోతున్నారు. ఇంత జరిగినా కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వర్సిటీ ప్రాంగణంలో ఆందోళనలు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి తర్వాత.. చండీగఢ్ యూనివర్సిటీని చుట్టుముట్టి 'వి వాంట్ జస్టిస్' అంటూ నినాదాలు చేశారు. ఐతే వీడియో తీసిన అమ్మాయిపై దాడి జరగకుండా హాస్టల్‌లోని ఓ గదిలో బంధించినట్లు సమాచారం. విద్యార్థుల ఆందోళనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్సిటీ పరిసరాల్లో భారీగా మోహరించారు. కొందరు ఆందోళనకారులు ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసుల వాహనాలపై విద్యార్థులు రాళ్లు విసరడంతో... లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఇక ఇంటర్నెట్‌లో వీడియో పోస్ట్ చేసిన యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు సిమ్లా వెళ్లారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: National, Punjab, VIRAL NEWS

  ఉత్తమ కథలు