Home /News /national /

6 YEAR OLD GIRL SWALLOWED CHOCOLATE INCLUDING WRAPPER DIED OF SUFFOCATION SHOCKING TRAGEDY FROM KARNATAKA SK

స్కూల్‌కు వెళ్లనని మారాం చేస్తుంటే.. చాక్లెట్ కొనిచ్చారు.. కానీ అదే ఆ చిన్నారి ప్రాణం తీసింది

చాక్లెట్ తిని మరణించిన చిన్నారి

చాక్లెట్ తిని మరణించిన చిన్నారి

ఓ చిన్నారి స్కూల్‌కు వెళ్నని మారం చేస్తుంటే.. చాక్లెట్ కొనిచ్చారు. కానీ అదే కొంపముంచింది. ఆ చాక్లెట్టే చిన్నారి ప్రాణం తీసింది.

    చిన్నపిల్లలు స్కూల్‌కు వెళ్లేటప్పుడు ఏడుస్తుంటారు. స్కూల్‌కు వెళ్లబోమని మారాం చేస్తుంటారు. దాదాపు అన్ని ఇళ్లల్లో ఇది జరుగుతుంటుంది. అలాంటి సమయంలో తల్లిదండ్రులు చాక్లెట్స్, స్నాక్స్ వంటివి ఆశజూపి.. పాఠశాలకు పంపిస్తుంటారు. కర్నాటకలో కూడా ఓ చిన్నారి స్కూల్‌కు వెళ్నని మారం చేస్తుంటే.. చాక్లెట్ కొనిచ్చారు. కానీ అదే కొంపముంచింది. ఆ చాక్లెట్టే చిన్నారి ప్రాణం తీసింది. ఉడిపి జిల్లా బందూర్ పట్టణ సమీపంలోని బిజూర్ గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.

    స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. బిజూర్ గ్రామానికి చెందిన సమన్వి అనే ఆరేళ్ల బాలిక.. బందూర్‌లో ఉన్న వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ప్రతిరోజూ స్కూల్ బస్సు వారి గ్రామానికి వస్తుంది. ఆ బస్సులోనే స్కూల్‌కు వెళ్తుంది సమన్వి. ఐతే బుధవారం రోజు స్కూల్‌కు వెళ్లనంటూ ఆ బాలిక మారాం చేసింది. తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. చాక్లెట్స్ కొనిస్తానని చెప్పడంతో స్కూల్‌కు వెళ్లేందుకు ఒప్పుకుంది. అనంతరం తల్లిదండ్రులు ఆమెకు చాక్లెట్ కొనిచ్చిచ్చారు. అంతలోనే స్కూల్ బస్సు రావడంతో... సమన్వి హడావిడిగా రేపర్‌తో పాటు చాక్లెట్‌ నోట్లో పెట్టుకుంది. స్కూల్ బస్సు ఎక్కేందుకు పరుగెత్తుతున్న క్రమంలో.. పొరపాటున చాక్లెట్‌ను రేపర్‌తో పాటు మింగేసింది. ఆ తర్వాత బస్సు ఎక్కిన కాసేపటికే సమన్వి కుప్పకూలింది. బస్సు డోర్ వద్దే స్పహ తప్పి పడిపోయింది. డ్రైవర్ వెంటనే బస్సును ఆపి.. స్కూల్ యాజమాన్యంతో పాటు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.



    తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని పాపను పరిశీలించారు. ఎంత పిలిచినా.. పలకకపోవడంతో ఆందోళన చెందారు. వెంటనే సమీపంలో ఉన్న ఓ ఆస్పత్రికి పంపించారు. బాలికకు పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆ పాప మరణించినట్లు నిర్ధారించారు. వైద్యులు చెప్పిన మాటలు విని.. ఆహె తల్లిదండ్రులు షాక్‌లోకి వెళ్లిపోయారు. అప్పటి దాకా ఆడుకుంటూ ఎంతో యాక్టివ్‌గా ఉన్న తమ కూతురు.. విగతజీవిగా పడి ఉండడం చూసి తట్టుకోలేకపోయారు. గుండెలు అవిసేలా రోదించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం పాప మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి పంపించారు. సమన్వి చాక్లెట్‌తో పాటు రేపర్‌ను మింగడం వల్లే.. ఆమె చనిపోయిందని పోస్టుమార్టం నివేదికలో తేలింది. బాలిక చనిపోవడంతో పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఈ ఘటనతలో స్కూల్‌తో పాటు బిజూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Chocolates, Karnataka

    తదుపరి వార్తలు