నిర్భయ దోషులకు ఉరి ఆలస్యం.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఒకే కేసులో శిక్ష పడిన దోషులందరినీ ఒకేసారి ఉరితీయాలన్న నిబంధన ఉండడంతో నిర్భయ దోషులు ఉరిశిక్షను జాప్యం చేసేందుకు వంతుల వారీగా తమకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకుంటున్నారు.


Updated: February 14, 2020, 9:54 PM IST
నిర్భయ దోషులకు ఉరి ఆలస్యం.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష వాయిదా పడుతూనే ఉంది. న్యాయపరంగా ఉన్న అవకాశాలను ఒక్కొక్కరూ వేర్వేరుగా వినియోగించుకుంటున్న నేపథ్యంలో శిక్ష అమలు ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మరణశిక్ష అప్పీల్స్‌ విషయంలో కొత్ తమార్గదర్శకాలకు రూపొందించింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత 6 నెలల్లో సంబంధిత కేసు విచారణ పూర్తిచేయాలని గడువు విధించింది. ఈ మేరకు ఫిబ్రవరి 12న జారీ అయిన సర్క్యులర్‌ను శుక్రవారం దేశ ప్రజలకు అందుబాటులో ఉంచింది.

సర్క్యులర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. హైకోర్టులు విధించే మరణశిక్షపై దాఖలయ్యే క్రిమినల్‌ అప్పీల్స్‌పై విచారణ ఆరు నెలలకు మించకూడదు. త్రిసభ్య ధర్మాసనం ఈ కేసులను విచారిస్తుంది.


వాస్తవానికి నిర్భయ దోషులు ముకేశ్‌ కుమార్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ను ఫిబ్రవరి 1నే ఉరితీయాల్సి ఉంది. వినయ్ క్షమాభిక్ష రాష్ట్రపతి వద్ద ఉందన్న కారణంతో అందరి ఉరిశిక్ష అమలును పాటియాలా హౌస్ కోర్టు వాయిదావేసింది. ఒకే కేసులో శిక్ష పడిన దోషులందరినీ ఒకేసారి ఉరితీయాలన్న నిబంధన ఉండడంతో నిర్భయ దోషులు ఉరిశిక్షను జాప్యం చేసేందుకు వంతుల వారీగా తమకున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకుంటున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాలను రూపొందించింది.

కాగా, నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్‌ శర్మ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్‌ భానుమతి ధర్మాసనం కొట్టివేసింది. క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో వినయ్ పిటిషన్ దాఖలు చేశాడు. తన ఆరోగ్యం బాగోలేనందున క్షమాభిక్ష ప్రసాదించలని, కానీ రాష్ట్రపతి మాత్రం తిరస్కరించారంటూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. వినయ్ దాఖలు చేసిన పిిటిషన్‌కు ఎలాంటి అర్హత కొట్టివేసింది. వినయ్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటూ మెడికల్ రిపోర్టులు చెబుతున్నాయని వెల్లడించింది. క్షమాభిక్ష తిరస్కరణపై న్యాక సమీక్ష కోరేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.నిర్భయ దోషుల డెత్ వారెంట్లపై పాటియాలా హౌజ్ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించనుంది.
First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు