హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

సరిహద్దులో మరో విషాదం..హిమాచల్‌లో ఆరుగురు జవాన్లు మృతి

సరిహద్దులో మరో విషాదం..హిమాచల్‌లో ఆరుగురు జవాన్లు మృతి

పుల్వామాలో 46 మంది జవాన్ల వీరమరణాన్ని మరవక ముందే..సరిహద్దులో మరో విషాదం చోటుచేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో మంచుచరియలు విరిగపడి ఆరుగురు ఐటీబీపీ జవాన్లు మరణించారు. గంగ్యా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మంచుచరియలు కింద మరికొందరు సైనికులు చిక్కుకోవడంతో వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు, మంచు నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు వెల్లడించారు.

హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులో వారం రోజులుగా విపరీతమైన మంచు కురుస్తోంది. హిమపాతం ధాటికి మంచుచరియలు విరిగిపడిన ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 9న జమ్మూ-శ్రీనగర్ హైవేపై మంచుచరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటనలో సెలెక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్ పర్వేజ్ చనిపోయారు. ఇటీవల కశ్మీర్‌లోని జవహర టన్నెల్ దగ్గర ఓ పోలీస్ పోస్ట్‌పై మంచుచరియలు విరిగపడ్డాయి. సుమారు 10 మంది భద్రతాదళ సిబ్బంది మంచులో కూరుకుపోయారు. వారిలో ఏడుగురు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. మరో ముగ్గురిని ప్రాణాలతో కాపాడాయి.

First published:

Tags: Himachal Pradesh

ఉత్తమ కథలు