6 Indian Army Divisions assigned to China border : గత రెండేళ్లుగా భారత్-చైనా(India-China) వివాదం కొనసాగుతోంది. ఎన్ని చర్చలు జరిగినా సమస్య కొలిక్కి రావడం లేదు. శాంతి చర్చలు ఎన్ని జరిగినా జిన్‌పింగ్ సేనల తీరు మారడం లేదు. దీంతో చైనాకు ధీటుగా భారత దళాలు సమాధానం ఇస్తున్నాయి. చైనా సరిహద్దుల్లో వివాదం ఇప్పట్లో తగ్గేట్లు లేకపోవడంతో భారత్ కీలక చర్యలు తీసుకొంది. గతంలో పాక్ సరిహద్దుపై(Pak Border) భారత్ బలగాల దృష్టి అధికంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారడంతో చైనా నుంచి వచ్చే ముప్పును అడ్డుకునేందుకే సైన్యం తొలి ప్రాధాన్యత ఇస్తోంది. ఈక్రమంలోనే బలగాల మోహరింపులో మార్పులు జరుగుతున్నాయి. ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు అమలు అవుతున్నాయి. తాజాగా పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వైపు నుంచి ఆరు డివిజన్లను లదాఖ్ సెక్టార్(Ladakh Sector) నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మొహరించింది. తాజా మార్పులతో జమ్మూ-కశ్మీర్ ఉగ్రవాద కార్యకలాపాలను అణిచి వేసే రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ డివిజన్ తూర్పు లద్దాఖ్ కు వెళ్లింది. ఇదివరకే అక్కడే మూడు డివిజన్లు పనిచేస్తున్నాయి. హర్యానాలోని స్ట్రైక్ కోర్ నుంచి ఓ డివిజన్‌ను ఉత్తరాఖండ్‌కు పంపారు. వన్ స్ట్రైక్ కోర్‌కు చెందిన మరో రెండు డివిజన్లు సైతం చైనా బోర్డర్‌కు తరలి వెళ్లాయి.
మరోవైపు,అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుల వెంట చైనా మౌలిక సదుపాయాలను మరింత పెంచుతోందని భారత సైన్యం తెలిపింది. బలగాల మరింత సులభంగా తరలించేందుకు వీలుగా రోడ్డు, రైలు, విమాన సేవల అనుసంధాన వ్యవస్థలను అభివృద్ధి చేస్తోందని భారత సైన్యం తూర్పు కమాండ్ అధిపతి లెఫ్ట్‌నెంట్ జనరల్ ఆర్.పి.కలీటా తెలిపారు. చైనా కదలికలను గమనిస్తున్న భారత సైన్యం కూడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని తెలిపారు.
ALSO READ Xi Jinping : చైనాలో కీలక పరిణామం..అధ్యక్ష పదవికి జిన్ పింగ్ రాజీనామా!
ఇదిలా ఉండగా, కరోనా వైరస్(Coronavirus) కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కరోనా వైరస్ విజృంభణతో అక్కడి పలు నగరాల్లో ఆంక్షలు,లాక్ డౌన్ లు కొనసాగుతున్నాయి. చైనా(China)లో కరోనా కట్టడి కోసం జిన్‌పింగ్.. జీరో కొవిడ్ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. చైనాలోని పలు నగరాల్లో ప్రజలకు బలవంతంగా కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్న వీడియోలు కూడా ఇటీవల బయటికొచ్చాయి. అయితే బలవంతంపు క్వారంటైన్ కూడా అక్కడ అమలు చేస్తున్నట్లు చైనీయులు వాపోతున్నారు. దీంతో జిన్‌పింగ్‌పై చైనీయుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అంతేగాక వ్యాపార సంస్థలపై కూడా ఆంక్షల వల్ల తీవ్ర ప్రభావం పడింది. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ కూడా ప్రభావితమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India-China, Indian Army