నూకలున్నాయ్.. 6 అడుగుల ఇనుపరాడ్ ఛాతీలో దిగినా బతికాడు

నూకలున్నాయ్.. 6 అడుగుల ఇనుపరాడ్ ఛాతీలో దిగినా బతికాడు

నేను బతకాలి అనే సంకల్పం అతనిలో బలంగా ఉంది. అదే అతన్ని మృత్యువు తరుముకొస్తున్నా... దాన్ని ఓడించేలా చేసింది. ఇందులో డాక్టర్ల శ్రమ కూడా చాలా ఉంది. అందుకే ఈ ఘటన సంచలనం అయ్యింది.

  • Share this:
    అది పంజాబ్... బతిండాలోని లెహ్రా గ్రామం. ఊళ్లో బండిపై వెళ్తూ... చూసుకోకుండా కాస్త వేగం పెంచాడు. సరిగ్గా అక్కడ రోడ్డుపై ఇసుకలాగా ఉంది. ఆ వేగంలో బండి టైర్ పక్కకు ఒరిగింది... దాంతో బండి పై నుంచి జారి... రోడ్డు పక్కకు పడ్డాడు. సరిగ్గా అక్కడే ఓ ఇనుప రాడ్డు ఉంది... అది సర్రున అతని ఛాతీలోకి దూసుకెళ్లింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఛాతీ దగ్గర నొప్పిగా ఉందేంటి అని చూడగా... రక్తం బొటబొటా కారుతోంది. తన పరిస్థితి చూసి తనకే భయం వేసింది. అర నిమిషం ముందు ఎలా ఉన్నా... ఇప్పుడెలా ఉన్నా... చిన్న రోడ్డు ప్రమాదం నన్ను చంపేసేలా ఉందే అనుకున్నాడు. కాస్త దూరం నుంచి ఈ ప్రమాదాన్ని చూసిన ప్రజలు పరుగెత్తుకుంటూ అతనివైపు వస్తుంటే... అప్పటికే హర్దీప్ అపస్మారక స్థితి లోకి వెళ్లిపోతున్నట్లు కనిపించాడు.

    కొందరు కుర్రాళ్లు అతన్ని... ఆదేశ్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. పరిస్థితిని చూసిన డాక్టర్లు... ఎవరితను, ఎలా జరిగింది.. వంటివేవీ అడగలేదు... హడావుడిగా ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకుపోయారు. అప్పటికప్పుడు ఆరుగురు డాక్టర్లు, 21 మంది పారామెడికోలు ఆపరేషన్‌లో తలమునకలయ్యారు. బయట అతన్ని తెచ్చిన కుర్రాళ్లకు టెన్షన్... టెన్షన్. ఆస్పత్రి మొత్తం ఇదే వార్త. అంత పెద్ద ఇనుప రాడ్డు అలా ఎలా గుచ్చుకుంది అనే అందరి ప్రశ్నా... డాక్టర్లు నానా తిప్పలు పడి... ఐదు గంటలపాటూ శ్రమించి... మొత్తానికి ఆ రాడ్డును బయటకు తీసి... కుట్రువేసి... హర్దీప్‌ను బతికించారు. ఆ వార్త తెలియగానే ఆస్పత్రి మొత్తం ఆనందపడింది. ఎందుకంటే ఇదో అరుదైన ఆపరేషన్. థియేటర్‌ నుంచి బయటికి వచ్చిన సర్జన్ డాక్టర్ సందీప్ ధండ్... "అతని అదృష్టమేంటంటే... ఆ రాడ్డు అతని గుండెకు తగల్లేదు. అది కొద్దిగా తగిలినా అతను చనిపోయేవాడే." అని చెప్పారు.

    ఈ కేసులో మరో ప్రత్యేకత ఉంది. ఆస్పత్రికి వచ్చాక హర్దీప్ యాక్టివ్ అయ్యాడు. ఎలాగైనా బతకాలనే ఆశ ఆతనిలో బాగా పెరిగింది. ఓవైపు డాక్టర్లు తన బాడీ నుంచి రాడ్డును తీస్తూ ఉంటే... అతను దాన్ని కళ్లారా చూడటమేకాదు... మాట్లాడుతూ ఉన్నాడు కూడా. "మీరు ఎలాగొలా రాడ్డును బయటకు తియ్యండి... మిగతాది ఆ దేవుడి చేతిలో ఉంటుంది ప్లీజ్" అంటూ వారితో మాట్లాడసాగాడు. అది 6 అడుగుల రాడ్డు. దాన్ని తొలగించినంతసేపూ చాలా రక్తం పోయింది. అంత రక్తం పోయినా మనిషి చనిపోతాడు. కానీ... లక్కీగా అతను బతికే ఉన్నాడు.

    ఇది కూడా చదవండి: NASA: శనిగ్రహ ఉపగ్రహంపై నాసా దృష్టి.. డ్రాగన్‌ఫ్లై మిషన్ నిర్మాణం

    ఈ ఘటన జరిగింది గురువారం. శుక్రవారం పోలీసులకు చెప్పారు. ఆస్పత్రికి వచ్చిన పోలీసులు... అతని పరిస్థితి ఎలా ఉందని డాక్టర్లను అడిగారు. ఆపరేషన్ తర్వాత హర్దీప్... అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతనికి ఫుల్ రెస్ట్ కావాలి. ఇప్పుడు అతన్ని డిస్టర్బ్ చెయ్యలేం అని డాక్టర్లు చెప్పడంతో... పోలీసులు కూడా నో ప్రాబ్లం... అతను కోలుకున్న తర్వాత మాకు సమాచారం ఇవ్వండి... అని డాక్టర్లకు చెప్పారు. ఇలా ఈ కేసును అందరూ ప్రత్యేక కేసుగా గుర్తించి సహకరించారు.
    Published by:Krishna Kumar N
    First published: