భారతదేశంలో ప్రాథమిక విద్యా హక్కు అమల్లోకి వచ్చాక.. దేశంలోని 6 నుంచి 14 ఏళ్ల బాలబాలికలందరికీ విద్య తప్పనిసరి చేశారు. ఇక కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు పిల్లల విద్య కోసం రకరకాల పథకాలు అమలు చేస్తూ.. మధ్యాహ్న భోజనాల వంటి సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇంత చేస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు. అందుకు అనేక కారణాలున్నాయి. బీహార్.. బెగూసరాయ్ జిల్లాలోని ఓ ప్రైమరీ స్కూల్లో.. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలు 120 మంది చదువుతున్నారు. అక్కడ టీచర్ల కొరత ఉంది. ప్రభుత్వం సరిపడా టీచర్లను నియమించడంలో ఫెయిలైంది. దాంతో ఓ చిన్నారి.. తన జూనియర్లకు పాఠాలు చెబుతోంది. తనే టీచర్‌గా మారి.. లోటు తీర్చుతోంది.
అన్నీ కొరతే:
పేద రాష్ట్రమైన బీహార్‌లోని చాలా స్కూళ్లు దయనీయ స్థితిలో ఉన్నాయి. బెగూసరాయ్ జిల్లా హెడ్‌క్వార్టర్స్‌కి 5 కిలోమీటర్ల దూరంలో.. మున్సిపల్ కార్పొరేషన్ వార్డ్ నంబర్ 17లో ఉన్న పట్టాపూర్ ప్రైమరీ స్కూల్లో.. ఐదో తరగతి చదువుతున్న చిన్నారి కుసుమ కుమారి.. ఓపైవు తాను చదువుతూ.. ఇతర పిల్లల్ని చదివిస్తూ బిజీగా ఉంది. ఈ పాప 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకూ.. మొత్తం 55 మంది పిల్లలకు పాఠాలు చెబుతోంది. రోజూ స్కూల్‌కి వచ్చి.. ఈ అదనపు సేవలు అందిస్తోంది. ఇందుకు ప్రభుత్వం నుంచి ఈ చిట్టి సరస్వతికి ఎలాంటి ప్రయోజనాలూ అందట్లేదు.
ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు ఈ స్కూల్‌కి చేరట్లేదు. అందువల్ల ఇక్కడ విద్యార్థులు చదువుకునేందుకు సరైన అవకాశాలు లేవు. ఈ స్కూల్లో ఇద్దరు టీచర్లే ఉన్నారు. సునీతా కుమారీ, సోనమ్ కుమారీ.. ఇద్దరూ కలిసి.. మొత్తం విద్యార్థులకు పాఠాలు చెప్పడం కుదరట్లేదు. ఈ పరిస్థితుల్లో ఆ బాధ్యతను తన నెత్తిన పెట్టుకుంది కుసుమ కుమారి. ఆ చిన్నారితో ఇలా చేయించకూడదని తెలిసి కూడా ఆ టీచర్లు గత్యంతరం లేక.. పాప సేవలు పొందుతున్నారు.
Video : కొండచిలువకు కోడి ఎర.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో
స్థానికులు ఎన్నిసార్లు చెప్పినా:
స్కూల్ పరిస్థితిపై స్థానికులు తరచూ జిల్లా కలెక్టర్, డీఈఓకి చెబుతూనే ఉన్నారు. కానీ అధికారులెవరీ ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోవట్లేదు. ఈ స్కూల్లో టీచర్ల కొరతే కాదు.. స్కూల్ పైకప్పు కూడా కొంత కూలిపోయింది. దీనావస్థలో ఉంది. డోర్లు, కిటికీలు కూడా సరిగా లేవు. దీనిపై అక్టోబర్ 10, 2022న స్థానికులు డీఎం రోషన్ కుష్వాహ, జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ షర్మిలా రాయ్‌కి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చినా.. స్కూల్‌ని చూసేందుకు ఏ ఆఫీసరూ రాలేదు. విద్యావ్యవస్థ ఇలా ఉంటే.. ఇక విద్యార్థుల చదువులు ఎలా సాగుతాయి? వారి కెరీర్ ఎటు పోతుంది? అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, EDUCATION, Nitish Kumar