5G NETWORK WILL BE STARTED IN 25 CITIES IN THIS YEAR ANNOUNCED TELECOM MINISTER ASHWINI VAISHNAV PVN
5G వచ్చేసింది..ఆ నగరాల్లో ఈ ఏడాదే అందుబాటులోకి 5G సేవలు!
ప్రతీకాత్మక చిత్రం
5G Network will be started in 20-25 cities : భారత ప్రజలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని 5జీ నెట్వర్క్(5G Network)కోసం ఎదురుచూస్తున్నారు. ఐదో తరం హైస్పీడ్ సర్వీస్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి,వేగం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. టెలికం సంస్థలు కూడా ట్రయల్స్ పూర్తి చేశాయి.
5G Network will be started in 20-25 cities : భారత ప్రజలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని 5జీ నెట్వర్క్(5G Network)కోసం ఎదురుచూస్తున్నారు. ఐదో తరం హైస్పీడ్ సర్వీస్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి,వేగం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. టెలికం సంస్థలు కూడా ట్రయల్స్ పూర్తి చేశాయి. తాజాగా 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వేగవంతమైన 5జీ నెట్వర్క్ రాక సమీపిస్తున్నట్టే కనిపిస్తున్నది. 5జీ స్పెక్ట్రం బ్యాండ్ల వేలానికి కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెలాఖరులో వేలం జరుగవచ్చని భావిస్తున్నారు. 5జీ నెట్వర్క్ను తీసుకొచ్చేందుకు ప్రైవేట్ టెలికం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సిద్ధంగా ఉన్నాయి. కొన్ని నగరాల్లో ఇప్పటికే ట్రయల్స్ నిర్వహించాయి. ఈ సమయంలో కేంద్ర టెలికాం, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav)కీలక వ్యాఖ్యలు చేశారు.
శనివారం మీడియాతో మాట్లాడిన అశ్విని వైష్ణవ్...ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని 20 నుంచి 25 నగరాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. విదేశాలతో పోల్చిచూస్తే 5జీ రేట్లు దేశంలో తక్కువగానే ఉంటాయని చెప్పారు. భారత టెలికామ్ కొత్త శకానికి 5 జీ నాంది అని ఆయన అభివర్ణించారు. 5 జీ టెక్నాలజీతోపాటు రాబోయే 6 జీ టెక్నాలజీ రంగంలో భారతదేశం అగ్రగామి దేశంగా ఆవిర్భవించే సమయం ఎంతో దూరంలో లేదని మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. విశ్వసనీయ నెట్వర్క్ ప్రొవైడర్ల జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో ఉందని, భారతదేశం అభివృద్ధి చేసిన సాంకేతికతపై ప్రపంచం ఆసక్తి చూపుతోందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక,ప్రస్తుతం దేశంలోని మొబైల్ డేటా చార్జీలు ప్రపంచంలోనే చాలా తక్కువని గుర్తుచేశారు.ప్రపంచ వ్యాప్తంగా డేటా రేట్లు సగటున 25 డాలర్లు ఉండగా దేశంలో కేవలం 2 డాలర్లుగానే ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. 5 జీ డేటా రేట్లు కూడా దీనికి తగ్గట్టుగానే ఉంటాయని చెప్పారు.
కాగా,4జీ నెట్వర్క్తో పోలిస్తే 5జీ 10రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ ఇస్తుందని తెలుస్తోంది. 5జీ టెక్నాలజీ బేస్ట్ సర్వీస్లను తెచ్చేందుకు టెలికం సర్వీస్ సంస్థలు హై, మిడ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ వినియోగిస్తాయని అంచనా. ఇదే జరిగితే ప్రస్తుత 4జీ సర్వీస్ ఇంటర్నెట్ కంటే 10 రెట్ల వేగం ఇచ్చే సామర్థ్యం ఉంటుంది అని నిపుణులు తెలిపారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.