హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Pok Women: ఆస్పత్రులే ఆమెకు ఇల్లు.. 55 ఏళ్ల వయసులో పాపం ఎంత కష్టం...పీవోకే మహిళ దీన గాథ..!

Pok Women: ఆస్పత్రులే ఆమెకు ఇల్లు.. 55 ఏళ్ల వయసులో పాపం ఎంత కష్టం...పీవోకే మహిళ దీన గాథ..!

Pok Women: పీవోకే ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పదేళ్లుగా ఆస్పత్రులే ఇళ్లు అయిపోయాయి. 55 ఏళ్ల వయసులోనూ కుటుంబం ఎక్కడుందో తెలియక ఎదురుచూస్తోందామె. కోల్‌కతాలో కాలం వెల్లదీస్తోన్న పీవోకే మహిళ దీన గాథ ఇదీ..

Pok Women: పీవోకే ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పదేళ్లుగా ఆస్పత్రులే ఇళ్లు అయిపోయాయి. 55 ఏళ్ల వయసులోనూ కుటుంబం ఎక్కడుందో తెలియక ఎదురుచూస్తోందామె. కోల్‌కతాలో కాలం వెల్లదీస్తోన్న పీవోకే మహిళ దీన గాథ ఇదీ..

Pok Women: పీవోకే ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పదేళ్లుగా ఆస్పత్రులే ఇళ్లు అయిపోయాయి. 55 ఏళ్ల వయసులోనూ కుటుంబం ఎక్కడుందో తెలియక ఎదురుచూస్తోందామె. కోల్‌కతాలో కాలం వెల్లదీస్తోన్న పీవోకే మహిళ దీన గాథ ఇదీ..

  పాక్ ఆక్రమిత కశ్మీర్ (Pok) ప్రాంతానికి చెందిన ఓ మహిళకు పదేళ్లుగా ఆస్పత్రులే ఇళ్లు అయిపోయాయి. 55 ఏళ్ల వయసులోనూ కుటుంబం ఎక్కడుందో తెలియక ఎదురుచూస్తోందామె. ఆస్పత్రి సిబ్బంది సహకారంతో కష్టాలను దాటుతోంది. దీంతో వైద్యులే ఆమెకు గార్డియన్లుగా మారారు. ఆ మహిళకు సేవలు చేసిన నర్సు, సొంత కుటుంబ సభ్యురాలిలా తోడు ఉంటోంది. కోల్‌కతాలో కాలం వెల్లదీస్తోన్న పీవోకే మహిళ దీన గాథ ఇదీ..

  కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజ్‌(NRS Medical College)లో దాదాపు పదేళ్లుగా ఉంటోంది పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన బరావో అబ్దుల్లా(Barao Abdullah) అనే మహిళ. 55 ఏళ్ల ఈ మహిళ.. తన వాళ్లు ఎవరనేది తెలియక, కోల్‌కత్తాలో తన వారని చెప్పుకొనేందుకు ఒక్కరూ కనిపించక ఆమె కాలం గడుపుతోంది. ఈ కష్టాల్లో ఆమెకు తోడుగా నిలిచింది కోల్‌కత్తాలోని ఎన్‌ఆర్‌ఎస్ మెడికల్ కాలేజ్. గత వారం బరావో అబ్దుల్లాకు రెండు కళ్లకు కాటర్యాక్ట్‌ సర్జరీ చేశారు. కోల్‌కత్తా నేషనల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ (CNMCH)లో సైకియాట్రీ విభాగం హెడ్‌గా పని చేస్తున్న వ్యక్తి ఆమెకు గార్డియన్‌గా మారారు. సర్జరీ(Surgery) జరగడానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేశారు. ప్రస్తుతం కోల్‌కత్తా పావ్‌లోవ్‌ హాస్పిటల్‌లో(Pavlov Hospital) ఉంది.

  TTD Hanuman Temple: హనుమాన్ జన్మస్థలంపై కొనసాగుతున్న వివాదం.. టీటీడీ ఏం చేయబోతోంది..?

  సర్జరీపై బరావో అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘నా కళ్లు ఇంకా నొప్పి పెడుతున్నాయి. అదొక్కటే ఇబ్బంది. నేను సంతోషంగానే ఉన్నాను’ అని చెప్పారు. ఆమెకు సీఎన్‌ఎంసీహెచ్‌లో ఆఫ్తమాలజీ విభాగం హెడ్‌ ముకుల్‌ బిశ్వాస్‌ ఆధ్వర్యంలో సర్జరీ జరిగింది. ఆదివారం బరావో అబ్దుల్లాను పావ్‌లోవ్‌ ఆస్పత్రికి తరలించారు.

  బరావో అబ్దుల్లాను 2006 ఏప్రిల్‌లో కోంటై వీధుల్లో తిరుగుతుండగా డిజంతా అనే స్వచ్ఛంద సంస్థ రక్షించింది. దుర్భర పరిస్థతిలో కనిపించిన ఆమెను ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. మానసిక వ్యాధితో (Mental Health Issues) బరావో అబ్దుల్లా బాధపడుతున్నట్లు గుర్తించారు. ఆమె పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని హర్‌చొవాల్‌ ప్రాంతానికి చెందినట్లు భావించారు. అయినా ఆమె కుటుంబ సభ్యులను గుర్తించే ప్రయత్నాలేవీ ఫలించలేదు. 2017 ఏప్రిల్‌లో ఆమెను ఎన్‌ఆర్‌ఎస్‌ నుంచి పావ్‌లోవ్‌ ఆస్పత్రికి తరలించారు.

  ఆమె వివరాలపై CNMCHలో సైకియాట్రీ విభాగం హెడ్‌గా పనిచేస్తున్న సుర్జిత్‌ ఘోష్‌ మాట్లాడుతూ.. ‘ప్రారంభంలో బరావో అబ్దుల్లా మానసిక సమస్యలు, హెల్యూజనేషన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించాం. చికిత్స ప్రారంభించాక కోలుకొన్నారు. ప్రస్తుతం చాలా తక్కువ మోతాదులోనే మెడిసిన్‌ వినియోగిస్తున్నారు. ఆమె బిహేవియర్‌ చాలా చక్కగా ఉంది. ఉన్నతమైన కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఆమె వాళ్లు ఎవరో తెలియక ఆస్పత్రుల్లోనే ఉండటం బాధాకరం. ఆమెను సౌకర్యవంతంగా ఉండేందుకు మేం ప్రయత్నించాం. ఆమె కూడా ఆస్పత్రిలో ఉండేందుకు వీలుగా మనసు మార్చుకొని సిద్ధపడ్డారు.’ అని చెప్పారు. ఎన్‌ఆర్‌ఎస్‌లో బరావో అబ్దుల్లా చేరినప్పటి నుంచి ఆయన ఆమెను పర్యవేక్షిస్తున్నారు.

  CNMCH పరిధిలో నడుస్తున్న పావ్‌లోవ్‌లోని అకాడమీ వార్డు ప్రస్తుతం బరావో అబ్దుల్లాకు ఇల్లు. వార్డు హౌస్‌లోని పేషంట్స్‌ ఆమెతో చక్కగా నడుచుకొంటున్నారు. బరావో అబ్దుల్లాకు రాయడం, చదవడం తెలుసు. ఆమె బెంగాలీ కూడా మాట్లాడగలదు. అయితే 55 ఏళ్ల వయసులోనూ తన కుటుంబం కోసం నిరీక్షిస్తోంది.

  LIC IPO: ఎల్ఐసీ ఐపీఓ అలర్ట్... ఇష్యూ డేట్, షేర్ ధర వివరాలివే

  వాలెంటైన్స్‌ డే రోజు హన్సి మిత్ర అనే నర్సు బరావో అబ్దుల్లాను కలిశారు. విధుల నుంచి రిటైర్‌ అయ్యే వరకు దాదాపు 11 ఏళ్లపాటు ఆ నర్సు (Nurse) బరావో అబ్దుల్లాకు ఎన్‌ఆర్‌ఎస్‌లో సేవలు అందించింది. వారిద్దరి మధ్య ఏర్పడ్డ బంధం నేటికీ కొనసాగుతోంది. ప్రతి వారం బరావో అబ్దుల్లా కోసం ఇంటి భోజనం తయారు చేసి హన్సి మిత్ర తీసుకొస్తుంది. ప్రత్యేక సందర్భాల్లో గిఫ్ట్స్‌ కూడా అందిస్తుంది. వీరి బంధం గురించి హన్సి మిత్ర మాట్లాడుతూ.. ‘నా రాక కోసం బరావో అబ్దుల్లా ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమెను సాధ్యమైనంత వరకు నేను డిసప్పాయింట్‌ చేయను. వీలైనన్ని రోజులు వచ్చి కలుస్తూనే ఉంటా. ఇప్పటికీ ఆమె రాత మారలేదు. కుటుంబం కోసం ఎదురు చూస్తూనే ఉంది.’ అని తెలిపారు.

  First published:

  Tags: National News, West Bengal

  ఉత్తమ కథలు