Home /News /national /

55 FISHERMEN AND 8 BOATS DETAINED BY SRILANKA NAVAL FORCES IN LAST 24 HRS TAMILNADU CM STALIN FIRED ON SRIALANKA NAVY PRV

Tamilnadu: 55 మంది మత్య్సకారులను అరెస్టు చేసిన శ్రీలంక నేవీ, నావికాదళం దౌర్జన్యాలు ఎక్కువయ్యాయంటూ తమిళనాడు సీఎం స్టాలిన్​ ఆగ్రహం

జాలర్లు (Photo: SuVe4Madurai/Twitter)

జాలర్లు (Photo: SuVe4Madurai/Twitter)

తమ దేశపు సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ తమిళనాడుకు చెందిన మత్స్యకారులను అరెస్ట్ చేసింది. తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దౌర్యన్యాలు ఎక్కువయ్యాయని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఆరోపించారు.

    తమిళనాడు మత్స్యకారులను (Tamilnadu fishermen) శ్రీలంక నేవీ (Srilanka Navy) అదుపులోకి తీసుకోవడంపై తమిళనాడులో ఆగ్రహావేశాలు మొదలయ్యాయి. ఆదివారం వరకు కేవలం 43 మంది మాత్రమే జాలర్లు నేవీ అదుపులో ఉన్నారని భావించినా.. సోమవారం వరకు ఆ సంఖ్య 55కి చేరింది. దీంతో తమిళనాడు సీఎం స్టాలిన్ (Tamilnadu CM Stalin)​ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంక నావికాదళం దౌర్జన్యాలు ఎక్కువయ్యాయంటూ మండిపడ్డారు.  అసలు ఏం జరిగిందంటే..  రామేశ్వరం ప్రాంతానికి చెందిన సుమారు 500 మంది జాలర్లు మరపడవల్లో శనివారం వేకువజామున సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. ఆదివారం వేకువజామున భారత్‌, శ్రీలంక దేశాల సముద్రజలాల సరిహద్దులో ఉన్న కచ్చాతీవు సమీపం నెడుదీవు వద్ద సుమారు జాలర్లు (Fishermen) చేపలు పడుతుండగా 20 గస్తీ పడవలలో వచ్చిన శ్రీలంక నావికాదళం సిబ్బంది వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.

    అక్రమంగా ప్రవేశించారంటూ..

    తమ దేశపు సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ (Illegally entered తమిళనాడుకు చెందిన మత్స్యకారులను అరెస్ట్  (Arrest)చేసింది. శనివారం సాయంత్రం తమిళనాడుకు చెందిన 43 మంది మత్స్యకారులను శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న 6 పడవలను (boats) సైతం స్వాధీనం చేసుకుంది. అనంతరం శ్రీలంక నావికాదళం (navy) వారిని కంగెసంతురాయ్ శిబిరానికి తీసుకెళ్లారు. ఈ వివరాలను తమిళనాడు మత్స్యశాఖ అధికారి ఆదివారం ప్రకటించారు. రామేశ్వరం (Rameshwaram) నుంచి వెళ్లిన 43 మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేసి.. 6 ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. దీంతోపాటు.. శ్రీలంక నావికాదళం (Srilanka Navy) మరో 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది. తమ దేశ ప్రాదేశిక జలాల్లో వేటాడినట్లు ఆరోపిస్తూ 12 మంది జాలర్లను అదుపులోకి తీసుకోని రెండు ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకుంది. గత రెండు రోజుల్లో శ్రీలంక నేవీ అరెస్ట్ చేసిన భారతీయుల (Indians) సంఖ్య 55 కి చేరుకుందని సోమవారం అధికారులు ప్రకటించారు. తమిళనాడుకు చెందిన కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఇప్పటికే భారత ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు ప్రారంభించారు.

    ఈ సంఘటన గురించి తెలుసుకున్న తమిళ జాలర్ల సంఘం (Tamil Fishermen's Association) ఆగ్రహం వ్యక్తంచేసింది. వారిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేసింది. శ్రీలంక తీరుకు నిరసనగా మత్స్యకార సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అధికారులు చొరవతీసుకొని మత్స్యకారులను విడిపించాలని వారి కటుంబాలు కోరుతున్నాయి. కాగా.. తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీలు (Political parties of Tamil Nadu) ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాయి. తమిళనాడుకు చెందిన మత్స్యకారుల విడుదల కోసం శ్రీలంక అధికారులతో (With the Sri Lankan authorities) వెంటనే మాట్లాడాలని అభ్యర్థించాయి.

    తమిళ మత్స్యకారులపై శ్రీలంక నేవీ దౌర్యన్యాలు ఎక్కువయ్యాయని తమిళనాడు సీఎం స్టాలిన్‌ (Tamil Nadu CM Stalin‌) ఆరోపించారు. జాలర్లందరినీ వెంటనే విడిపించాలని, ఇప్పటి వరకు శ్రీలంక ఆధీనంలో ఉన్న మొత్తం 73 పడవలను విడుదల చేయించాలని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (Foreign Minister S. Jaishankar‌)ను కోరారు.



    తమ వారిని విడు దల చేసే వరకు నిరాహార దీక్ష చేపడతామని మత్స్యకారుల సంఘం హెచ్చరించింది. మరోవైపు సీఎం స్టాలిన్​ లెటర్ (Letter)​పై స్పందిచాల్సిందిగా మదురై ఎంపీ వెంకటేశన్ ట్విటర్​లో​ కోరారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Fishermen, MK Stalin, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు