హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Hybrid Workplace: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇక మీకు నచ్చిన చోటు నుంచే జాబ్ చేయొచ్చు.. మెజార్టీ కంపెనీల నిర్ణయం అదే..!

Hybrid Workplace: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇక మీకు నచ్చిన చోటు నుంచే జాబ్ చేయొచ్చు.. మెజార్టీ కంపెనీల నిర్ణయం అదే..!

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇక మీకు నచ్చిన చోటు నుంచే జాబ్ చేయొచ్చు..

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇక మీకు నచ్చిన చోటు నుంచే జాబ్ చేయొచ్చు..

ఉద్యోగుల సౌలభ్యం కోసం హైబ్రిడ్ వర్క్‌ప్లేస్ సదుపాయం కల్పించడానికి 53 శాతం కంపెనీలు ఇష్టపడుతున్నాయని వర్కింగ్ స్పేస్ ప్రొవైడింగ్ కంపెనీ ఆఫిస్ (Awfis) తెలిపింది. సంస్థ చేపట్టిన తాజా సర్వేలో ఈమేరకు ఫలితాలు వచ్చినట్లు వెల్లడించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వర్క్ ప్లేస్ అనేవి చాలా కంపెనీలకు సాధారణంగా మారాయి. అయితే ఉద్యోగుల సౌలభ్యం కోసం హైబ్రిడ్ వర్క్‌ప్లేస్ సదుపాయం కల్పించడానికి 53 శాతం కంపెనీలు ఇష్టపడుతున్నాయని వర్కింగ్ స్పేస్ ప్రొవైడింగ్ కంపెనీ ఆఫిస్ (Awfis) తెలిపింది. సంస్థ చేపట్టిన తాజా సర్వేలో ఈమేరకు ఫలితాలు వచ్చినట్లు వెల్లడించింది. హైబ్రిడ్ వర్క్‌ప్లేస్ అంటే... ఉద్యోగి తన పనిని ఇంటి నుంచైనా, ఆఫీసు నుంచైనా చేయడం. ఉద్యోగి సౌలభ్యం, కంపెనీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ స్థాయిల్లో ఈ హైబ్రిడ్ వర్క్‌ప్లేస్‌ను కంపెనీలు ప్రవేశపెడుతున్నాయి. సమయం, డబ్బు ఆదా చేయడం, ఉద్యోగుల సౌలభ్యం, మొత్తంగా ఉద్యోగుల శ్రేయస్సులే ప్రాధాన్యాలుగా ఈ వర్క్‌స్పేస్ వ్యూహాన్ని అమలు చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి.

అందులో భాగంగానే హైబ్రిడ్ వర్క్‌ప్లేస్‌ని కల్పించాలనుకుంటున్న వారిలో 74 శాతం మంది తమ కార్యాలయాలను లొకేషన్-సెంట్రిక్ నుంచి పీపుల్-సెంట్రిక్ వర్క్‌స్పేస్‌లుగా మార్చడానికి చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే కరోనా సద్దుమణుగుతున్నందున టెలికాం, కన్సల్టింగ్ రంగాల ఉద్యోగుల్లో 75 నుంచి 100 శాతం మంది తిరిగి కార్యాలయానికి వస్తారు. కానీ ఐటీ ఉద్యోగుల్లో తిరిగి కార్యాలయాలకు వచ్చే వారి సంఖ్య చాలా తక్కువ.

ఇదీ చదవండి: రోజు రోజుకీ కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సప్.. ఇక డిలీట్ ఆప్షన్ ఎన్ని రోజుల తర్వాత చేయొచ్చంటే!


నిజానికి లాక్‌డౌన్ తర్వాత కూడా చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ట్రాఫిక్‌లో, కాలుష్యంలో గంటల తరబడి ప్రయాణం చేసి ఆఫీసులకు చేరుకునే కష్టాలు లేకపోవడం దీనికి కారణం. ఏదైనా అవసరం ఉంటేనే ఆఫీసులకు వెళ్లేలా ఉంటే బాగుండునని వారు కోరుకుంటున్నారు. యాజమాన్యాలు కూడా దీనిని గుర్తించాయి. అందుకే హైబ్రిడ్ వర్క్‌స్పేస్ కల్చర్‌ని తీసుకొస్తున్నాయి. అంటే వారంలో కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. మిగిలిన కొన్ని రోజులు ఆఫీసుకు వెళ్లొచ్చు. అందుకే ఉద్యోగుల ఆరోగ్యం, యోగ క్షేమాలు ప్రధానంగా వారు ఆఫీసులకు సులభంగా వచ్చేందుకు ఈ హైబ్రిడ్‌ విధానం ఉపయోగపడుతుందని కంపెనీలు సైతం దీనివైపే మొగ్గు చూపుతున్నాయి.

ఇందులో ఇంకొక లాభం ఏమిటంటే, కంపెనీలు రూరల్ ఏరియాల నుంచి కూడా ప్రతిభ గల ఉద్యోగులను ఎంపిక చేసుకుని వారితో అక్కడి నుంచే పని చేయించుకోవచ్చు. అందుకోసం కొన్ని కంపెనీలు డిస్ట్రిబ్యూటెడ్ వర్క్‌స్పేస్‌ని ప్రారంభించడానికి ఫ్లెక్స్ సెంటర్‌లను దత్తత తీసుకునే అవకాశం ఉందని, ఆ తర్వాత మెట్రో, మెట్రోయేతర నగరాల్లో తమ సొంత కార్యాలయాలను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

ఈ డిస్ట్రిబ్యూటెడ్ వర్క్‌ప్లేస్ వ్యూహం డబ్బును, సమయాన్నీ ఆదా చేయడమే కాకుండా, ఉద్యోగులు తమ దైనందిన జీవితాన్ని, పనిని సమతుల్యం చేసుకునేందుకు సహకరిస్తుందని కంపెనీలు భావిస్తున్నాయి. ఉద్యోగి కేంద్రంగా తీసుకున్న ఈ చర్య, ఉద్యోగుల్ని మానసికంగా ఉత్సాహంగా ఉంచడంతో పాటు ఉత్పాదకత కూడా పెరగడానికి దోహదం చేస్తుందని కంపెనీలు భావిస్తున్నాయి.

ఈ పరిణామాలు రియల్ ఎస్టేట్ రంగంలో కార్యాలయాల డిమాండ్‌ని తగ్గించాయని చెప్పవచ్చు. భవిష్యత్తులో సంప్రదాయ కార్యాలయాల స్థానంలో ప్లెక్స్ సెంటర్స్ దర్శనమివ్వడం ఖాయం. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు సైతం ఈ హైబ్రిడ్ వర్క్‌ప్లేస్‌ని తమ సంస్కృతిలో భాగం చేసే అవకాశాలనూ తీసిపారేయలేం.

First published:

Tags: Employees, Hybrid model, IT Employees, Work From Home

ఉత్తమ కథలు