LoC వద్ద 500 మంది టెర్రరిస్టులు.. గుంటనక్కల్లా వెయిటింగ్...

ఎంతమంది వచ్చిన వారిని ఎరిపారేసి ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను పరిరక్షించడానికి తాము సర్వ సన్నద్ధంగా ఉన్నామని రన్‌బీర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: October 11, 2019, 9:00 PM IST
LoC వద్ద 500 మంది టెర్రరిస్టులు.. గుంటనక్కల్లా వెయిటింగ్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్‌లో ఏ క్షణమైనా చొరబడేందుకు 500 మంది టెర్రరిస్టులు కాచుకుని కూర్చున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద వివిధ టెర్రరిస్ట్ క్యాంపుల్లో వారంతా ఉన్నట్టు భారత ఆర్మీలో ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. పాకిస్తాన్ సాయంతో భారత్‌లోకి చొరబడి జమ్మూకాశ్మీర్‌ని మరోసారి రావణకాష్టంలా మార్చేందుకు 200 నుంచి 300 మంది సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ‘జమ్మూకాశ్మీర్‌లో ఉన్న మిలిటెంట్లకు తోడు.. 200 నుంచి 300 మంది వచ్చి వారితో కలిశారు.’ అని ఉత్తర ప్రాంత కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రన్‌బీర్ సింగ్ మీడియాకు తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో ఎంతమంది మిలిటెంట్లు ఉన్నారు? పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఎంతమంది చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారనే సమాచారం కోసం మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. సుమారు 500 మంది టెర్రరిస్టులు LoCకి అవతల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని వివిధ క్యాంపుల్లో ఉన్నారని, ఏ క్షణమైనా జమ్మూకాశ్మీర్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తారని ఆయన తెలిపారు.

ఎంతమంది వచ్చిన వారిని ఎరిపారేసి ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను పరిరక్షించడానికి తాము సర్వ సన్నద్ధంగా ఉన్నామని రన్‌బీర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్‌లో శాంతి నెలకొనడం తమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తూనే ఉందని చెప్పారు. ఇప్పటికీ పాకిస్తాన్ గడ్డ మీద నుంచి భారత్‌లోకి టెర్రరిస్టులను పంపిస్తోందని చెప్పారు. ముష్కరులకు పాకిస్తాన్ అన్నిరకాలుగా తోడ్పాటు అందిస్తోందన్నారు. డ్రోన్ల ద్వారా కూడా వారికి ఆయుధాలను సమకూరుస్తోందని చెప్పారు.

మీ పాలలో ప్లాస్టిక్ ఉందా? ఈ పాలలో ఉంది జాగ్రత్త

Published by: Ashok Kumar Bonepalli
First published: October 11, 2019, 8:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading