హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

అలా చేస్తే కౌంటింగ్‌కు 6 రోజులు పడుతుంది... సుప్రీంకోర్టుకు తెలిపిన ఈసీ

అలా చేస్తే కౌంటింగ్‌కు 6 రోజులు పడుతుంది... సుప్రీంకోర్టుకు తెలిపిన ఈసీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒక్కో అసెంబ్లీ స్థానంలో 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలంటే కనీసం ఆరు రోజుల సమయం పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

కౌంటింగ్ సందర్భంగా ఒక్కో నియోజకవర్గంలో సగానికి పైగా వీవీప్యాట్లను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. దీనిపై సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చిన ఈసీ వీవీప్యాట్లు 50% లెక్కించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఆ విధంగా లెక్కించాలంటే కనీసం ఆరు రోజుల సమయం పడుతుందని వెల్లడించింది. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 400కి మించి పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని... అలాంటి వాటిలో 8-9 రోజుల సమయం కావాలని పేర్కొంది.

ఒకసారి ఇది ప్రారంభిస్తే రీకౌంటింగ్‌ డిమాండ్లు ఎక్కువవుతాయని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో వివరించింది. అప్పుడు సమయం మరింత పెరుగుతుందని అభిప్రాయపడుతుంది. అంత భారీ స్థాయిలో యంత్రాంగం కూడా అందుబాటులో లేదని అని వివరించింది. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించడానికి కనీసం 50% వీవీప్యాట్లను లెక్కించి ఈవీఎంలతో సరిపోల్చాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు 21పార్టీల నేతలు వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఈసీ దాఖలు చేసింది.

First published:

Tags: Chandrababu Naidu, Election Commission of India, Lok Sabha Election 2019, Supreme Court

ఉత్తమ కథలు