మూతపడ్డ స్టెరిలైట్ కాపర్... రోడ్డున పడనున్న 50 వేల మంది..!

Shiva Kumar Addula | news18india
Updated: June 6, 2018, 3:25 PM IST
మూతపడ్డ స్టెరిలైట్ కాపర్... రోడ్డున పడనున్న 50 వేల మంది..!
  • Share this:
ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో తూత్తుకుడిలోని స్టెరిలైట్ రాగి ప్లాంట్ ను తమిళనాడు ప్రభుత్వం శాశ్వతంగా మూసివేసింది. ఈ ఫ్యాక్టరీ పెద్ద ఎత్తున కాలుష్యం వెదజల్లుతోందని, ప్లాంట్ ను మూసివేయాలని వంద రోజుల పాటు ఆందోళనలు జరిగాయి. అవి హింసాత్మకగా మారడంతో పోలీసుల కాల్పుల్లో 13 మంది చనిపోయారు. ప్రజా వ్యతిరేక కారణంగా ప్లాంట్ ను మూసివేస్తూ తమిళనాడు సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలు శాంతించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. స్టెరిలైట్ రాగి ప్లాంట్ మూత పడితే జరిగే నష్టాన్ని తెలుసుకుంటే షాకవడం ఖాయం.దేశంలో ఏటా టా 10 లక్షల టన్నుల రాగి ఉత్పత్తవుతోంది. ఇందులో 50 శాతం హిందాల్కో ఇండస్ట్రీస్ నుంచి, 40 శాతం తూత్తుకుడిలోని స్టెరిలైట్ నుంచి ఉత్పత్తి కాగా.. మరో 10 శాతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి ఉత్పత్తవుతోంది. మొత్తం రాగిలో 40 శాతం చైనా సహా పలు దేశాలకు ఎగుమతి అవుతోంది. ఇప్పుడు స్టెరిలైట్ ప్లాంట్ మూతపడడంతో 4 లక్షల టన్నుల ఉత్పత్తి   నిలిచిపోనుంది.   ఇది దేశంలోని ఎలక్ట్రికల్ సెక్టార్ పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది.దేశంలోని 800 చిన్న, మధ్య తరహా ఎలక్ట్రికల్ యూనిట్లకు రాగి సరఫరా నిలిచిపోనుంది. దీంతో కేబుల్ మానుఫ్యాక్చరర్స్, వైండింగ్ వైర్ యూనిట్స్, ట్రాన్స్ ఫార్మర్ మానుఫ్యాక్చరర్స్ కంపెనీలు మూతపడనున్నాయి. ఆయా పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడనున్నారు. సుమారు 50 వేల మంది ఉద్యోగాలు కోల్పోతారని నిపుణులు భావిస్తున్నారు.స్టెరిలైట్ ప్లాంట్ మూతపడడంతో నష్టపోయే పరిశ్రమల్లో ఎక్కువ భాగం పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లో ఉన్నాయి. అంతేకాదు ట్యూటికోరిన్ నుంచి విదేశాలకు ఎగుమతయ్యే 1.6 లక్షల టన్నుల రాగి కూడా నిలిచిపోనుంది.ఇప్పటికే దేశంలో ఏటేటా 8 శాతం వరకు రాగికి డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడున్న పరిశ్రమలతో పాటు అదనంగా పరిశ్రమలు ఏర్పాటు కాకుంటే..2020 నాటికి విదేశాల నుంచి రాగిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి కొత్తవి రాకపోగా.. ఉన్న పరిశ్రమల్లో నుంచి స్టెరిలైట్ కంపెనీ మూతపడింది. దీంతో రాబోయే రోజుల్లో రాగి కొరత మరింత తీవ్రమవనుంది. మొత్తంగా స్టెరిలైట్ మూతపడడంతో ఆ ప్లాంట్ సిబ్బందితో పాటు దానిపై ఆధారపడిన కంపెనీల్లోని ఉద్యోగులు కూడా రోడ్డున పడనున్నారు. 
First published: May 29, 2018, 10:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading