సరిహద్దుల్లో మాటు వేసిన ముష్కర మూక.. భారత్ మీదకు ఎగదోస్తున్న పాక్

ప్రతీకాత్మక చిత్రం

భారత్ లో అలజడులు సృష్టించి ప్రశాంత ప్రజా జీవితాన్ని విచ్ఛిన్నం చేసి ఇక్కడ రక్తపాతాన్ని సృష్టించడానికి పాకిస్థాన్ పన్నాగం వేసిందా...? అంటే అవుననే అంటున్నాయి నిఘా సమాచార వర్గాలు. దేశంలో రక్తపాతాన్ని సృష్టించేందుకు గానూ 50 మంది ట్రైన్డ్ ఉగ్రవాదులను మనమీదకు ఉసిగొల్పుతున్నట్టు తెలుస్తున్నది.

 • News18
 • Last Updated :
 • Share this:
  మాటలతో చెప్పినా.. చేతలతో చూపినా.. పాకిస్థాన్ వక్రబుద్ది ఎంతకూ మారడం లేదు. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ నిత్యం నియంత్రణ రేఖ వద్ద అలజడులు సృష్టిస్తున్న దాయాది దేశం.. తాజాగా మరోసారి భారత్ లో అల్లర్లకు తెగబడేందుకు ముష్కరుల మందను మనదేశంలోకి పంపించాలని చూస్తున్నది.  ప్రశాంతంగా ఉన్న దేశంలో రక్తపాతం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నది.  ఈ మేరకు నిఘా వర్గాలకు పక్కా సమాచారం రావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. భారత్ లోకి చొరబడటానికి సుమారు 50 మంది ముష్కర మూక నియంత్రణ రేఖ వద్ద కాచుకుని కూర్చున్నట్టు తెలుస్తున్నది.

  వివరాల్లోకెళ్తే... భారత్ లో అలజడులు సృష్టించి ప్రశాంత ప్రజా జీవితాన్ని విచ్ఛిన్నం చేసి ఇక్కడ రక్తపాతాన్ని సృష్టించడానికి పాకిస్థాన్ పన్నాగం వేసిందా...? అంటే అవుననే అంటున్నాయి నిఘా సమాచార వర్గాలు. దేశంలో రక్తపాతాన్ని సృష్టించేందుకు గానూ 50 మంది ట్రైన్డ్ ఉగ్రవాదులను మనమీదకు ఉసిగొల్పుతున్నట్టు నిఘా వర్గాలకు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో జమ్మూ కాశ్మీర్ వెంబడి సరిహద్దు ప్రాంతాలన్నింటినీ సైన్యం అప్రమత్తం చేసింది. ఈ మూక అంతా.. ఎల్ఓసీ కి ఆవల పాక్ బోర్డర్ లో ఉన్న లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ లతో పాటు మరికొన్ని ఉగ్రవాద సంస్థలకు చెందిన వారేనని ఇంటిలిజెన్స్ విభాగం అనుమానిస్తున్నది. వీరిని సరిహద్దు దాటించడానికి పాక్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు ఆ సంస్థ అధికారులు తెలిపారు.

  ముగ్గురు జవాన్ల వీరమరణం..
  ఒకవైపు సరిహద్దులలో చొరబాట్లకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు గుప్పుమంటుండగానే జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో చోటుచేసుకున్న ఎన్కౌంటర్ లో.. ఇద్దరు భారత ఆర్మీ జవాన్లతో పాటు ఒక బీఎస్ఎఫ్ జవాన్ అమరులయ్యారు. ఆపరేషన్ లో భాగంగా.. ఎల్ఓసీకి సమీపంలో ఉన్న మాచిల్ సెక్టార్ వద్ద ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. శనివారం అర్ధరాత్రి ఆ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలు ఉన్నట్టు గుర్తించిన సైన్యం.. ఆ మేరకు పెట్రోలింగ్ నిర్వహించింది. ఇందులో భాగంగా నిఘా ఏర్పాటు చేయగా.. ఇది గమనించిన అవతలివైపున ఉన్న ముష్కరులు సైనికులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ముగ్గురు సైనికులు మ‌‌ృతి చెందారు. వీర సైనికులకు దేశం మొత్తం కన్నీటి నివాళి అర్పిస్తున్నది.
  Published by:Srinivas Munigala
  First published: