50 ACRES OF LAND SOLD FOR THE TREATMENT OF CORONA BUT NO MORE VRY
Corona Treatment : కరోనా చికిత్సకు 8 కోట్ల ఖర్చు, 50 ఎకరాల భూమి అమ్మకం.. అయినా ..
కరోనా చికిత్సకు 8 కోట్లు
Corona Treatment : కరోనా ( Corona ) ట్రీట్మెంట్ కోసం ఓ రైతు ఏకంగా 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. అందుకోసం తన 50 ఎకరాల భూమిని సైతం అమ్మాడు.. దురదృష్టవశాత్తు ఆయన ప్రాణం మాత్రం మిగల్లేదు.
కరోనా కల్లోలం అనేక మంది బ్రతులకు చిద్రం చేస్తోన్న విషయం తెలిసిందే.... జీవితంలో తమ కళలను సాకారం చేసుకుని, స్థిర పడిన కుటుంబాలనే కాకుండా, ఉన్నత స్థాయి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది.. ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోలేక అనేక మంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న వారు ఉన్నారు.. అయితే కొంతమంది తమ ప్రాణాల కోసం లక్షల రూపాయలు అప్పులు తెవడం లేదా ఆస్తులు అమ్ముకోవడం అనేది పరిపాటిగా మారింది... అయినా వారి ప్రాణాలకు మాత్రం గ్యారంటీ లేకుండా పోతుంది.
ఇలా ఓ వ్యక్తికి కరోనా సోకడంతో ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలను ఎనిమిది నెలల కాలంలో ఖర్చు చేశాడు.. అత్యంత ఖరీదైన వైద్యుల పర్యవేక్షణలో రోజుకు మూడు లక్షల రూపాయలను ఖర్చు చేశారు.. ఇందుకోసం ఆయనకు చెందిన 50 ఎకరాల భూమిని కూడా అమ్ముకున్నా ప్రయోజనం మాత్రం దక్కలేదు.. చివరకు ఎనిమిది నెలల పాటు కరోనాతో పోరాడి ప్రాణాలు విడిచిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
UP Elections : ఆమె కూతురు బీజేపీ ఎమ్మెల్యే చేతిలో రేప్‌కు గురైంది..! బాధితురాలి తల్లికి, ఇలా అవకాశం కల్పించింది కాంగ్రేస్ పార్టీ..
మధ్యప్రదేశ్ కు చెందిన ధర్మజయ్ అనే రైతుకు గతేడాది మే 2న కరోనా సోకింది. ఊపిరితిత్తుల సమస్యతో రైతు పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం ఆయన్ను చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్పించారు... ఉన్నత స్థాయి వైద్యుల పర్యవేక్షణలో ఆయన వైద్యం తీసుకున్నాడు.. దీంతో రోజుకు రూ.3 లక్షల చొప్పున ఖరీదైన ట్రీట్ మెంట్ ఇచ్చారు. అలా 8 నెలలు పాటు చికిత్స అందించారు. ఆయన చికిత్స కోసం లండన్ వైద్యులు కూడా మానిటరింగ్ చేశారు..ఇలా మొత్తం ఎనిమిది కోట్ల రూపాయలు ఖ్చు చేశారు. అయినా అతని ఆరోగ్యం బాగుపడలేదు. అయితే ధరమ్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ బాగా వ్యాపించింది. అదే సమయంలో కిడ్నీ విఫలమైంది. మెదడులో రక్తస్రావం జరిగింది. పరిస్థితి విషమంచి గత మంగళవారం రాత్రి సమయంలో ఆయన చనిపోయాడు.
అయితే ధర్మజయ్ కుటుంబం ల్యాండ్ లార్డ్ ,ముగ్గురు అన్నదమ్ములు కావడం వారికి తమ తాతల నుండి సుమారు వెయ్యి ఎకరాలు వారసత్వంగా వచ్చిన భూమి ఉంది.. దీంతో ఆ భూమిలో నుండి కరోనా చికిత్స కోసం 50 ఎకరాలను అమ్మివేసినట్టు చెప్పారు. అయినా తమ సోదరుడి ప్రాణం దక్కలేదని వాపోయారు. దీంతో కరోనా భారిన వారికి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇలా చాలా మంది లక్షలు ఖర్చు పెట్టిన వారు రాష్ట్రంలో అనేకమంది ఉన్నారు. వారం రోజులకు ఇళ్లు ,భూములు అమ్ముకుని 50 లక్షల వరకు తెలంగాణలో ఖర్చుపెట్టిన వార్తలు అనేకం వెలుగు చూశాయి. కాని ఎనిమిది కోట్లు కరోనా ద్వారా వచ్చిన వ్యాధులకు ఖర్చు పెట్టడం మాత్రం చర్చించుకోవాల్సిన అంశమే..
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.