ఇక ఆ యాడ్లకు దబిడ దిబిడే... 5 ఏళ్ల జైలు శిక్ష... రూ.50 లక్షల ఫైన్...

ఇక ఆ యాడ్లకు దబిడ దిబిడే... 5 ఏళ్ల జైలు శిక్ష... రూ.50 లక్షల ఫైన్...

New Delhi : కేంద్ర ప్రభుత్వం అడ్డగోలు ప్రకటనల విషయంలో సీరియస్‌గా ఉంది. కొన్ని కఠిన షరతులతో డ్రాఫ్ట్ బిల్లు రెడీ చేసింది. దాన్ని ఆమోదించితే ఇక ఆ ప్రకటనలు దాదాపు కనిపించవు.

 • Share this:
  New Delhi : మీకు పిల్లలు కలగట్లేదా... ఈ మందు వాడండి సంతానమే సంతానం... మీ జుట్టు తెల్లబడిపోతోందా... ఈ ఆయిల్ వాడితే... వారం రోజుల్లో అద్భుతాన్ని చూస్తారు... ఎన్ని క్రీములు వాడినా చర్మం తెల్లబడట్లేదా... ఐతే... ఈ చూర్ణం వాడండి... మెరిసిపోతారు... వంటి యాడ్స్ మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. ఆ యాడ్లు ఎంతలా నమ్మిస్తాయంటే... చాలా మంది అందులో చెప్పే క్రీములు, లోషన్లను వాడినట్లు చెబుతారు. తమ లైఫ్ పూర్తిగా మారిపోయిందంటారు. అలాంటి యాడ్స్ చూసి చాలా మంది ఎట్రాక్ట్ అవుతున్నారు. వేలకు వేలు పెట్టి ప్రొడక్ట్స్ కొనుక్కుంటున్నారు. తీరా చూస్తే... ఏ లాభమూ కలగట్లేదు. ఇలా వినియోగదారులు ఎందుకు మోసపోవాలి? అని ఆలోచించిన కేంద్ర ప్రభుత్వం... ఇలాంటి పనికిమాలిన యాడ్లకు చెక్ పెట్టేందుకు చట్టంలో మార్పులు చేసింది. ఆ సవరణల ప్రకారం... ఇకపై ఇలాంటి అసత్య ప్రకటనలు చేసిన కంపెనీ నిర్వాహకులు, బాధ్యులకు 5 ఏళ్ల జైలు శిక్షతోపాటూ... రూ.50 లక్షల ఫైన్ కూడా వెయ్యబోతోంది.

  కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ... డ్రగ్స్ అండ్ మేజిక్ రెమెడీస్ (అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్‌మెంట్స్ యాక్ట్ 1954) (Objectionable Advertisements Act, 1954) చట్టంలో మార్పులు చేసింది. ఇకపై ఇలాంటి యాడ్స్ చేయించే కాస్మొటిక్ కంపెనీలు జాగ్రత్త వహించాల్సిందే. ఇష్టమొచ్చినట్లు ఏది బడితే అది యాడ్స్‌లో చెప్పేసి... తర్వాత తమకు సంబంధం లేదంటే కుదరదు. ఈ కేసుల్లో యాడే ఆధారంగా నిలుస్తుంది కాబట్టి... కంపెనీలు శిక్షను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

  ఈ డ్రాఫ్ట్ బిల్లులో కొన్ని అదనపు అంశాలు కూడా చేర్చారు. సపోజ్... ఆయా యాడ్లలో క్రీములు, లోషన్లూ వాడటం వల్ల వినియోగదారులకు వ్యాధులు, అనారోగ్య సమస్యలు వస్తే... వాటికి అయ్యే ఖర్చుల్ని కూడా కాస్మొటిక్ కంపెనీలే చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 78 రకాల వ్యాధులు, సమస్యల్ని చట్టంలో చేర్చారు. ఆ ప్రకటనల్లో సెక్సువల్ పెర్ఫార్మెన్స్, స్కిన్ టోన్, ప్రీమెచ్యూర్ ఏజింగ్, ఎయిడ్స్, జుట్టు తెల్లబడుట, మహిళల్లో సంతాన ప్రాప్తి అంశాలకు సంబంధించిన యాడ్స్ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టబోతోంది కేంద్రం.

  ఈ చట్టం ప్రకారం... మొదటి పనిష్మెంట్ కింద... ఆరు నెలల వరకూ జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించేవారు. ఆ తర్వాత కూడా తప్పు చేస్తే... ఏడాది జైలు లేదా ఫైన్ లేదా రెండూ విధించేవారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం... మొదటిసారి తప్పు చేస్తే... రెండేళ్ల జైలుతోపాటూ... రూ.10 లక్షల ఫైన్ విధిస్తారు. రెండోసారి తప్పు చేస్తే... ఐదేళ్ల జైలు, రూ.50 లక్షల ఫైన్ విధిస్తారు.

  ఈ కొత్త ప్రతిపాదనలపై ప్రజలు, సంస్థల అభిప్రాయాల్ని త్వరలో కేంద్రం కోరుతోంది. ఇందుకు నోటీస్ ఇచ్చిన 45 రోజుల్లో అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుంది. ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. ఈ యాడ్లు కేవలం టీవీల్లో వచ్చేవి మాత్రమే కాదు. ఆడియో, వీడియో, రిప్రజెంటేషన్, ప్రొనౌన్స్‌మెంట్, ఎండార్స్‌మెంట్.... లైట్, సౌండ్, స్మోక్, గ్యాస్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్, వెబ్‌సైట్ ఇలా ఎందులో వచ్చినా చట్ట రీత్యా నేరమే అవుతుంది. ఊహాతీతమైన, వాస్తవ విరుద్ధమైన యాడ్లపైనే ఈ చర్యలుంటాయి.


  Published by:Krishna Kumar N
  First published: