5 TRAINS RUN AT SAME TIME OVER BRIDGE INDIAN RAILWAY CREATES HISTORTY PVN
OMG : దటీజ్ ఇండియన్ రైల్వే..నది వంతెనపై ఏకకాలంలో ఐదు రైళ్లు నడిపి కొత్త రికార్డ్
ఏకకాలంలో బ్రిడ్జ్ పై ఐదు రైళ్లు
5 Trains run at same time over bridge : భారతీయ రైల్వే(Indian Railway) చరిత్రాత్మక రికార్డు సృష్టించింది. మంగళవారం బీహార్ రాష్ట్రంలోని రోహ్తాస్(Rohtas) జిల్లాలో డెహ్రీ టౌన్ లో సోన్ నదిపై వంతెనపై ఏకకాలంలో 5 రైళ్లను(Five Trains) విజయవంతంగా నడిపి రైల్వే అభివృద్ధి, సాంకేతికతలో కొత్త చరిత్రను సృష్టించింది. ఈ వంతెన సామర్థ్యం... ఏకకాలంలో 6 రైళ్ల భారాన్ని మోయగలదు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఈస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రంట్ కారిడార్' నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్లోని సాహ్నేవాల్ నుండి దంకుని వరకు ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ నిర్మించబడింది. దీనిని ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నిర్మించింది. ఇది అనేక రాష్ట్రాల మధ్య సరుకు రవాణాను సులభతరం చేస్తుంది. ఈ కారిడార్ పంజాబ్ నుండి పశ్చిమ బెంగాల్ వరకు వివిధ ప్రాంతాల గుండా వెళుతుంది, కాబట్టి ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి సరకు రవాణాలో చాలా సౌలభ్యం ఉండే అవకాశం ఉంది. దీని ద్వారా ముడిసరుకు వేగంగా గమ్యాన్ని చేరుకోగలుగుతుంది.
ఈ కారిడార్ ప్రారంభంతో వివిధ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా వస్తువుల రవాణా చాలా సులువుగా మారుతుంది. పారిశ్రామిక అభివృద్ధి దిశలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఈ మార్గంలో భాగంగా బీహార్ లోని రోహ్తాస్ మరియు ఔరంగాబాద్ జిల్లాల మధ్య ఉన్న సోన్ నదిపై నిర్మించిన వంతెన ద్వారా ఒకేసారి 6 రైళ్లు ప్రయాణించవచ్చు. దాని విజయవంతమైన ట్రయల్ కూడా జరిగింది. మంగళవారం రైల్వేశాఖ.. వంతెనపై ఏకకాలంలో ఒకవైపు నుంచి 3 రైళ్లను, మరోవైపు నుంచి 2 రైళ్లను నడిపి ఈ రికార్డు సృష్టించింది. అన్ని సాంకేతిక అడ్డంకులు తొలగించి, ఒకేసారి 5 రైళ్లను నడిపి రికార్డు సృష్టించారు. ఈ వంతెన సామర్థ్యం... ఏకకాలంలో 6 రైళ్ల భారాన్ని మోయగలదు
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.