Trump India Tour : భారత పర్యటనపై ట్రంప్ ఆసక్తికర కామెంట్స్...

Trump India Tour : ఈ నెల 24న తన భార్యతో కలిసి డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు భారతీయులకు ఎంతో ఆనందం కలిగిస్తున్నాయి.


Updated: February 12, 2020, 9:32 AM IST
Trump India Tour : భారత పర్యటనపై ట్రంప్ ఆసక్తికర కామెంట్స్...
Trump India Tour : భారత పర్యటనపై ట్రంప్ ఆసక్తికర కామెంట్స్...
  • Share this:
Donald Trump India Tour : అమెరికా అధ్యక్షుడు ఇండియాకి వస్తున్నారంటే మాటలా. ఆయనతోపాటూ... భారీ సెక్యూరిటీ, వాహన కాన్వాయ్‌లు, భద్రతాధికారులు ఇలా ఎంతో హంగామా ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ హంగామా విషయంలో ఏమాత్రం కంగారు పడట్లేదు. ఆయన పడుతున్న టెన్షనంతా ఇండియన్స్ గురించే. ఎందుకంటే... అమెరికాలో ట్రంప్ పర్యటనలకు, సభలకు మహా అయితే 40వేల నుంచీ 50 వేల మంది వస్తారట. అదే ఆయన ఇండియాకి వచ్చేటప్పుడు... లక్షల మంది అభిమానులు వస్తారనీ... అంత మంది వస్తే... తాను ఇబ్బంది పడాల్సి వస్తుందని ట్రంప్ అంటున్నారు. ట్రంప్‌తో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ... ట్రంప్ ఇండియాకి వచ్చినప్పుడు... దాదాపు 50 లక్షల నుంచీ 70 లక్షల మంది... ఎయిర్‌పోర్ట్ నుంచీ అహ్మదాబాద్‌లోని కొత్తగా నిర్మించిన స్టేడియం వరకూ స్వాగతం పలుకుతారని అన్నారట. అంతే అమ్మో అంత మందా... అని భయపడుతున్నారు ట్రంప్. మోదీ కట్టిస్తున్నది మామూలు స్టేడియం కాదు. ప్రపంచంలోనే అది పెద్దది. నిర్మాణం దాదాపు పూర్తైంది అని ట్రంప్ అన్నారు.

దాదాపు రూ.700 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియంలో... దాదాపు లక్ష మంది వీక్షకులు కూర్చునేందుకు వీలుంది. ఇప్పటివరకూ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ అతి పెద్దదిగా ఉండగా... ఇప్పుడు దాన్ని మించిపోబోతోంది అహ్మదాబాద్ స్టేడియం.

ట్రంప్‌ తొలిసారిగా తన భార్య మెలానియాతో కలిసి ఈ నెల 24, 25న భారత్‌లో పర్యటించనున్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా... అహ్మదాబాద్‌లో నిర్మిస్తున్న మోతేరా స్టేడియం దగ్గర పబ్లిక్ ర్యాలీలో మోదీతో కలిసి పాల్గొనే అవకాశం ఉంది. దీనిపైనే ట్రంప్ టెన్షన్ పడుతున్నారు. అంత మంది అభిమానులు వస్తే... తట్టుకోగలనా అంటున్నారు.

ట్రంప్ టూర్‌లో రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ప్రజల మధ్య సంబంధాల్నీ బలోపేతం చేసేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని వైట్‌హౌస్ తెలిసింది. ప్రధాని మోదీ ఆహ్వానంతో ట్రంప్‌ ఈ పర్యటనకు వస్తున్నారు. భారత్‌కు సుమారు రూ.13,543 కోట్ల సమీకృత వాయు రక్షణ ఆయుధ వ్యవస్థ (integrated air defence weapon system)ను ఇండియాకి అమ్మేందుకు అమెరికా ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ క్రమంలో ఆమెరికా 45వ అధ్యక్షుడైన ట్రంప్ భారత్‌లో పర్యటించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని గొప్ప పెద్ద మనిషి అంటూ ప్రశంసించిన మోదీ... తన పర్యటన కోసం ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.

First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు