సంచలన ట్వీట్లకు కేరాఫ్ సుష్మస్వరాజ్... ఆమె చేసిన ఆ ఐదు ట్వీట్లూ అదుర్స్...

Sushma Swaraj : రాజకీయ నాయకులు ట్వీట్లు చెయ్యడం సహజమే. 9 సార్లు పార్లమెంట్‌కి ఎన్నికైన సుష్మస్వరాజ్ మాత్రం... విదేశాంగ మంత్రిగా ఉంటూ... ట్వీట్లతోనే ఎంతో మందికి చేరువయ్యారు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 7, 2019, 8:21 AM IST
సంచలన ట్వీట్లకు కేరాఫ్ సుష్మస్వరాజ్... ఆమె చేసిన ఆ ఐదు ట్వీట్లూ అదుర్స్...
సుష్మస్వరాజ్ (File)
  • Share this:
Sushma Swaraj : ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్న భారత రాజకీయ నేతల్లో సుష్మస్వరాజ్ ఒకరు. ఆమెకు ట్విట్టర్‌లో కోటి 30లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. మూడేళ్ల కిందట కిడ్నా ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ జరిపించుకున్నప్పటి నుంచీ సుష్మ ఆరోగ్యంగా లేరు. 67 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూసిన ఆమె... ఆ మధ్య దాకా విదేశాంగ మంత్రిగా ఎంతోమందికి చేరువయ్యారు. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది భారతీయులకు ఆమె ట్విట్టర్ ద్వారా సాయం చేశారు. విదేశాంగ మంత్రిగా ఆమె చేసిన ట్వీట్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాలా సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. ఆమె ఓ ప్రతిభావంతురాలైన నాయకురాలనీ, అద్భుతమైన పాలనా చాతుర్యం ఆమెది అని మెచ్చుకున్నారు.

మరణానికి మూడు గంటల ముందు ఆమె చివరిసారిగా ట్వీట్ చేశారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం, ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని చివరి ట్వీట్‌లో ఆమె మెచ్చుకున్నారు. ఈ ట్వీట్‌ను లక్షా 76వేల మంది లైక్ చెయ్యగా... 43వేల మంది రీట్వీట్ చేశారు.సుష్మస్వరాజ్ తన జీవితకాలంలో చేసిన ఐదు అద్భుతమైన ట్వీట్లు ఇవి :ఈ ఏడాది మార్చిలో... మలేసియాలో ఉన్న ఓ భారతీయుడు... తన ఫ్రెండ్‌ని ఇండియా నుంచీ తిరిగి మలేసియా రప్పించాల్సిందిగా కోరుతూ సుష్మస్వరాజ్‌కి ట్వీట్ చేశాడు. ఐతే... ఇంగ్లీష్‌లో ఉన్న ఆ ట్వీట్‌లో గ్రామర్ తప్పులు ఉన్నాయి. అది చూసిన మరో ట్వీటర్... హిందీలోగానీ, పంజాబీలో గానీ ట్వీట్ పంపమని సూచించాడు. వెంటనే రిప్లై ఇచ్చిన సుష్మస్వరాజ్... మరేం పర్లేదనీ, తాను విదేశాంగ మంత్రి అయ్యాక... అన్ని యాక్సెంట్స్ (యాస)లో, గ్రామర్‌లో ఇంగ్లీష్ ఫాలో అవుతున్నానని తెలిపారు.


ట్విట్టర్‌లో సుష్మస్వరాజ్ తన పేరు ముందు చౌకీదార్ అని ఎందుకు పెట్టుకున్నారో చెప్పాలని మార్చిలో ఓ నెటిజన్ కోరగా... మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ తర్వాత ఆ స్థాయిలో విదేశాంగ మంత్రిగా ఘాటైన రిప్లై ఇచ్చారు సుష్మస్వరాజ్. తాను భారతీయుల రక్షణ కోసం కాపలాదారుగా ఉన్నాననీ, విదేశాల్లోని భారతీయుల కోసం పనిచేస్తున్నానని తెలిపారు.

"మై భీ చోకీదార్" (నేను కూడా కాపలాదారుణ్నే) అనేది లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రచార అస్త్రం. కాంగ్రెస్ చేసిన చౌకీదార్ చోర్ హై (కాపలాదారు దొంగ) ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ అస్త్రాన్ని ప్రయోగించింది.


జర్మనీలో భారతీయ జంటను కత్తితో పొడిచిన సందర్భంలో ఓ యూజర్... ఈ ట్వీట్లు సుష్మస్వరాజ్ చెయ్యట్లేదనీ, ఆమెకు సంబంధించిన PR వ్యక్తి చేస్తూ ఉండొచ్చని ట్వీట్ చేశాడు. దానికి రిప్లై ఇచ్చిన సుష్మస్వరాజ్... ట్వీట్ చేస్తున్నది తానేననీ, దెయ్యం (ghost) కాదనీ సమాధానం ఇచ్చారు.


చలాకీగా సమాధానాలు ఇవ్వడంలో సుష్మాకు తిరుగులేదు. ఆమెను ఇబ్బంది పెట్టేందుకు ఓ నెటిజన్... మార్స్‌పై చిక్కుకుపోతే మీరు కాపాడేందుకు సాయపడతారా అని ప్రశ్నించాడు. దానికి చక్కగా సమాధానం ఇచ్చిన ఆమె... మీరు మార్స్‌లో చిక్కుకున్నా సరే... అక్కడి భారత రాయబార కార్యాలయం మీకు సాయం చేస్తుంది అని ట్వీట్ చేశారు.


పాడైన రిఫ్రిజిరేటర్‌ను సరిచేసే విషయంలో మీరు సాయం చేస్తారా అనే తిక్క ప్రశ్న వేశాడో నెటిజన్. దానికి సుష్మస్వరాజ్... బ్రదర్... ఈ విషయంలో నేను సాయం చెయ్యలేను. నేను ఒత్తిడిలో ఉన్న మనుషుల కోసం సాయం చేయడంలో బిజీగా ఉన్నాను అని కుండబద్ధలు కొట్టారు.


2016లో రాష్ట్రపతి భవన్‌లో 19 మంది మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. దానికి సుష్మ హాజరు కాలేదు. ఈ సందర్భంగా... దీన్నో హెడ్‌లైన్ చెయ్యొద్దని మీడియాను కోరిన ఆమె... సుష్మ ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేదు అనే హెడ్డింగ్ పెట్టవద్దని కోరుతూ ట్వీట్ చెయ్యడం అప్పట్లో సంచలనం అయ్యింది. మంత్రివర్గ విస్తరణ తర్వాత... మంత్రుల బృందం ప్రమాణస్వీకారం చేసింది

Published by: Krishna Kumar N
First published: August 7, 2019, 6:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading