• Home
 • »
 • News
 • »
 • national
 • »
 • 5 TERRORISTS ENTERED INDIA VIA NEPAL UTTAR PRADESH ATS ON HIGH ALERT SK

దీపావళి రోజున ఉగ్రదాడులు.. నేపాల్ మీదుగా భారత్‌లోకి టెర్రరిస్టులు

ప్రతీకాత్మక చిత్రం

జమ్మూ, పంజాబ్‌తో పాటు ఇతర ఎయిర్ బేస్‌లను ఆర్మీ ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఆరెంజ్ అలర్ట్ చేసి భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని ఆదేశించారు.

 • Share this:
  భారత్‌లో విధ్వంసానికి టెర్రరిస్టులు కుట్రలు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో అంతర్జాతయ సరిహద్దు, ఎల్‌వోసీ వెంబడి కట్టుదిట్టమైన భద్రత ఉండడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు ఉగ్రవాదులు భారత్‌లో చొరబడినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. కనీసం ఐదుగురు టెర్రరిస్టులు నేపాల్ మీదుగా భారత్‌లోకి చొరబడినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. ఉగ్రవాదుల మధ్య టెలిఫోన్ సంభాషణను విన్నామని.. పెద్ద కుట్రే చేస్తున్నారని తెలిపారు. చివరిసారిగా ఇండో-నేపాల్ సరిహద్దులోని గోరఖ్‌పూర్‌ వద్ద ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ను అప్రమత్తం చేశారు.

  దీపావళి రోజున ఉగ్రదాడులు నిర్వహించాలని.. ఢిల్లీ చేరుకున్న తమవారిని కలుసుకోవాలని టెర్రరిస్టులు ప్లాన్ చేసుకున్నారు. జనావాస ప్రాంతాలతో పాటు ఆర్మీ స్థావరాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో జమ్మూ, పంజాబ్‌తో పాటు ఇతర ఎయిర్ బేస్‌లను ఆర్మీ ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఆరెంజ్ అలర్ట్ చేసి భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని ఆదేశించారు.

  ఇక కశ్మీర్‌లో ఇప్పటికే పలు చోట్ల ఉగ్రదాడులు జరిగాయి. బుధవారం షోపియన్ జిల్లాలో ఓ పండ్ల వ్యాపారి, పుల్వామా జిల్లా కాకపోరా ప్రాంతంలో ఓ కార్మికుడిని ఉగ్రవాదులు హతమార్చారు. సోమవారం రోజుల క్రితం పండ్ల లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కుపై దాడిచేసి.. డ్రైవర్‌ను కాల్చి చంపారు. పండ్ల వ్యాపారిపైనా దాడి చేసి చితకబాదారు. కశ్మీర్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు రవాణాకు ఆటంకం కలిగించేందుకే ఉగ్రవాదులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అధికారులు భావిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై ప్రతికారంతో రగిలిపోతున్నారు ఉగ్రవాదులు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున దాడులకు కుట్ర చేస్తున్నారు.
  First published: