హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

5 State Elections: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రారంభం.. ఇవీ తాజా అప్‌డేట్స్

5 State Elections: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రారంభం.. ఇవీ తాజా అప్‌డేట్స్

(ప్రతీకాత్మక చిత్రం )

(ప్రతీకాత్మక చిత్రం )

5 State Elections: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యమైన ఘట్టం ప్రారంభమైంది. గెలుపు ఎవరిది అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.

5 State Elections: దేశవ్యాప్తంగా ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈసారి గెలుపు ఎవరిది అన్నది హాట్ టాపిక్ అయ్యింది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఇవాళ ఒకే దశలో పూర్తిగా ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి... అక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఇవాళ ఓటర్లు ఒక్కరోజులో తేల్చేస్తున్నారు. ఇక బెంగాల్, అసోంలో మూడో విడత పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికలకు ప్రచారం ఓ రేంజ్‌లో సాగిన విషయం మనకు తెలుసు.

Tamil nadu Polls: తమిళనాడులో మళ్లీ అధికారంలోకి రావాలని అన్నాడీఎంకే బీజేపీతో కలిసి ముందుకుసాగగా... పదేళ్ల తర్వాత కచ్చితంగా అధికారం చేపట్టాలని డీఎంకే కాంగ్రెస్‌తో కలిసి గట్టిగా పోరాడింది. హామీల జల్లు మామూలుగా కురవలేదు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 6 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఈసారి అక్కడ 3,998 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మరి ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో.

Kerala Polls: ఇక కేరళలో 1980 నుంచి ఓటర్లు ప్రతి ఐదేళ్లకోసారి పార్టీని మార్చేస్తున్నారు. LDF, UDF మార్చి మార్చి అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఐతే... ఈసారి ఈ చరిత్ర పునరావృతం కాదు అంటున్నారు. LDF మళ్లీ అధికారంలోకి వస్తుందని సర్వేలు అంచనా వేశాయి. ఇక్కడ మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2.74 కోట్ల మంది ఓటర్లు ఓటు వేస్తున్నారు. 957 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

West Bengal Third Phase: పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరుగుతుంటే... ఇవాళ జరుగుతున్నది మూడో దశ. మొత్తం 31 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. 78.52 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. బరిలో ఉన్న 205 మంది అభ్యర్థులు తమదే గెలుపు అంటున్నారు. ప్రతి దశలోనూ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. ఈసారి కూడా మూడో దశలో అలాగే జరిగింది. దీదీ టార్గెట్‌గా బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించగా... ఒంటికాలితో బెంగాల్‌లో, రెండు కాళ్లతో ఢిల్లీలో గెలుస్తానని మమత ప్రతినబూనారు.

Assam Polls: అసోంలో 40 స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఇదే చివరి విడత. 337 మంది అభ్యర్థులు ఇవాళ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Horoscope 6-4-2021: రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి పెళ్లి సంబంధాలు కుదిరే ఛాన్స్

Puducherry election: ఇక పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితోపాటూ మలప్పురం, కన్యాకుమారి లోక్‌సభ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఈ పోలింగ్ నిర్వహిస్తున్నారు.

First published:

Tags: 5 State Elections, Kerala Assembly Elections 2021, Puducherry Assembly Elections 2021, Tamil Nadu Assembly Elections 2021, West Bengal Assembly Elections 2021

ఉత్తమ కథలు