Home /News /national /

5 POINT 3 MAGNITUDE EARTHQUAKE HIT SRINAGAR AND PARTS OF JAMMU KASHMIR MKS

Srinagar earthquake : కంపించిన కార్గిల్, లదాక్.. 5.3తీవ్రతతో కాశ్మీర్‌లో భూకంపం

కాశ్మీర్ లో భూకంపం

కాశ్మీర్ లో భూకంపం

జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ కేంద్రంగా వచ్చిన భూకంపం స్థానికంగా కలకలం రేపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. కార్గిల్, లదాక్ లోనూ భూప్రకంపలను చోటుచేసుకున్నాయి. దీనిపై స్థానిక అధికారులు చెప్పిన వివరాలివి..

దాయాది పాకిస్తాన్, డ్రాగన్ చైనాతో సరిహద్దు గొడవలకు కేంద్రాలుగా ఉండే కార్గిల్, లదాక్ ప్రాంతాలు ఇవాళ కంపించాయి. జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ కేంద్రంగా వచ్చిన భూకంపం స్థానికంగా కలకలం రేపింది. భూకంప గుర్తింపు విభాగం, జమ్మూకాశ్మీర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది.

కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రగా 5.3గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. రాత్రి 7.01 గంటలకు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించినట్టు చెబుతున్నారు. కార్గిల్, లదాక్ ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వినిపించినట్టు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో ప్రమాదం వాటిల్లినట్టు కానీ, ఆస్తి నష్టం జరిగినట్టు కానీ తెలియలేదు.
Published by:Madhu Kota
First published:

Tags: Earthquake, Jammu kashmir

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు