హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Terror Alert: పండగనాడు ఉగ్రవాదులకు మూడింది... ఇండియన్ ఆర్మీ చేతిలో ఆరుగురు ఔట్

Terror Alert: పండగనాడు ఉగ్రవాదులకు మూడింది... ఇండియన్ ఆర్మీ చేతిలో ఆరుగురు ఔట్

ఇండియన్ ఆర్మీ చేతిలో ఆరుగురు ఔట్ (credit - twitter - ANI)

ఇండియన్ ఆర్మీ చేతిలో ఆరుగురు ఔట్ (credit - twitter - ANI)

Terror Alert: ఉగ్రవాదులకు ఎక్స్‌ట్రాలు ఎక్కువయ్యాయి. దేశంలోకి చొరబడుతుంటే... BSF నుంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి... తర్వాత జరిగిందో భారీ ఆపరేషన్.

అది... పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు. తార్న్ తరాన్ జిల్లా... ఖెమ్‌కారన్ ఏరియా... ఉదయం 4.45 అయ్యింది. కీచురాళ్లు తమ పని తాను చేస్తున్నాయి. అంతలో... సరిహద్దు దగ్గర ఏపుగా పెరిగిన సర్కందా గడ్డి మొక్కల దగ్గర ఏదో కదలిక. అర కిలోమీటర్ దూరంలో ఉన్న BSF పెట్రోలింగ్ టీమ్ క్యాజువల్‌గా నైట్ విజన్ బైనాక్యులర్‌కి పనిపెట్టింది. అందులోంచి చూస్తే... ఆ తుప్పల్లో నుంచి ఏదో జంతువు వస్తున్నట్లు కనిపించింది. ఇంకాస్త జూమ్ చేసి చూస్తే... అంది జంతువు కాదనీ... ఉగ్రవాది అని అర్థమైంది. అంతే... పెట్రోలింగ్ టీమ్... తమలో తామే మాట్లాడకుండా సైగలు చేసేసుకుంది. "మీరు అటు వెళ్లండి... మీరు ఇటు వెళ్లండి... మేం ఇటు వెళ్తాం" అనే టైపులో ఉన్నాయి ఆ సైగలు. కాసేపటికే... చెల్లా చెదురుగా వెళ్లిన టీమ్స్... సరైన టైమ్ కోసం ఎదురుచూశాయి. ఓ ఉగ్రవాది... తుప్పల్లోంచీ ఇండియాలోకి వచ్చి... ఒళ్లు విరుచుకొని... ఏకే 47 బయటకు తీసి... దాన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఆకాశం వైపు చూశాడు ఓ పది మందిని లేపేస్తా అన్నట్లుగా. ఇంతలో... గుండెలోకి ఏదో దిగినట్లు సుయ్ మని సౌండ్. కట్ చేస్తే... అది BSF నుంచి దూసుకొచ్చిన బుల్లెట్... AK 47 చేతిలోంచి జారింది. ముద్దు పెట్టుకున్నచోటే... మట్టి కరిచాడు. అది చూసిన... మరో నలుగురు ఆగ్రహావేశాలతో రగిలిపోతూ... ఇష్టమొచ్చినట్లుగా అన్ని దిక్కులకూ కాల్పులు జరిపారు. అదే సమయంలో... HSF జవాన్లు... బుల్లెట్లు వేస్ట్ చెయ్యకుండా... గురి చూసి... పక్కాగా కాల్పులు జరిపారు.

అప్పటివరకూ అరిచిన కీచురాళ్ల సౌండ్ చిన్నబోయింది. అటుగా ఆహారం వెతుక్కుందామని వచ్చిన కుక్క... నాయనో అనుకుంటూ వెనక్కి పారిపోయింది. దాదాపు పావుగంటపాటూ... ఆ ప్రదేశం బుల్లెట్ల మోత మోగింది. చివరకు అటు నుంచి కాల్పులు ఆగిపోవడంతో... సైన్యం ముందడుగులు వేసి చూసింది... మొత్తం ఐదుగురు ఉగ్రవాదుల్ని లేపేసినట్లు ఫిక్సైంది. గత అర్థరాత్రి నుంచే బోర్డర్ దగ్గర ఏదో జరుగుతున్న అనుమానం BSFకి కలిగింది. అక్కడ ఓ బైనాక్యులర్ వేసి ఉంచారు.

మీకు తెలుసా... దశాబ్ద కాలంలో... పాకిస్థాన్‌తో ఉన్న 3300 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుల్లో... ఒకేసారి ఒకే ఘటనలో ఎక్కువ మందిని (ఐదుగుర్ని) లేపేయడం ఇదే మొదటిసారి. ఘటనా స్థలంలో ఓ AK 47, 2 పిస్టళ్లు లభించాయి.

జమ్మూకాశ్మీర్‌లో కూడా ఇలాంటిది జరిగింది. బారాముల్లాలో అదే పనిగా కాల్పులు జరుపుతున్న ఓ ఉగ్రవాదిని... గురి చూసి లేపేశారు మన సైనికులు. ఐతే... ఇప్పుడు అక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది.

First published:

Tags: Jammu and Kashmir

ఉత్తమ కథలు