Punjab: సిద్ధూ ప్రమాణస్వీకారానికి వెళ్తున్న బస్సుకు రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

నవ్‌జోత్ సింగ్ సిద్దు

కాంగ్రెస్ కార్యకర్తల బస్సును ఎదురుగా వస్తున్న పంజాబ్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఇద్దరు బస్సు డ్రైవర్లు స్పాట్‌లోనే చనిపోయారు. వీరితో పాటు మరో ముగ్గురు మరణించారు. దాదాపు 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి

  • Share this:
    పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నవజోత్ సింగ్ సిద్ధూ ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్ధూ ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.  మోగా పట్టణ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తల బస్సును ఎదురుగా వస్తున్న పంజాబ్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.  ఇద్దరు బస్సు డ్రైవర్లు స్పాట్‌లోనే చనిపోయారు. వీరితో పాటు మరో ముగ్గురు మరణించారు. దాదాపు 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కార్యకర్తలు మరణించడంతో కాంగ్రెస్ పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

    మరోవైపు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పటియాలాలోని తన నివాసం నుంచి చండీగఢ్‌కు బయలుదేరారు సిద్దూ. ఇవాళ మధ్యాహ్నం ఆయన పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.



    సీఎం అమరీందర్ సింగ్ వ్యతిరేకించినప్పటికీ.. నవజోత్ సింగ్ సిద్దూకే రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలను సోనియా గాంధీ అప్పజెప్పిన విషయం తెలిసిందే.  ఆయన్ను పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. సిద్దూతో పాటు మరో నలుగురిరి కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జులై 18న ఉత్తర్వులు వెలువరించారు. ఇక సంగట్ సింగ్ గిల్జియాన్, సుఖ్విందర్ సిండ్ డానీ, పవన్ గోయెల్, కుల్జిత్ సింగ్ నగ్రాను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఈ నేపథ్యంలో ఇవాళ పీసీపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు సిద్ధూ. ఈ కార్యక్రమానికి సీఎం అమరీందర్ సింగ్ కూడా హాజరుకానున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: