హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Earthquake: అరుణాచల్‌లో భూకంపం.. వరుస ప్రకంపనలతో భయం భయం.. ఇది దేనికి సంకేతం?

Earthquake: అరుణాచల్‌లో భూకంపం.. వరుస ప్రకంపనలతో భయం భయం.. ఇది దేనికి సంకేతం?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Earthquake: ఇండియా, నేపాల్ సరిహద్దుల్లో గత రెండు మూడు రోజులుగా వరుస భూకంపాలు వస్తుండడంతో.. అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పెద్ద భూకంపానికి ఇది సంకేతమా? అని టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

భారత్‌ను వరుస భూకంపాలు (Earthquake) భయపెడుతున్నాయి. బుధవారం నేపాల్‌(Nepal)తో పాటు ఉత్తరాఖండ్‌లోనూ భూమి కంపించగా.. ఇవాళ కూడా భూప్రకపంనలు నమోదయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోనే రెండుసార్లు భూమి కంపించింది. ఉదయం 10:31 సమయంలో వెస్ట్ సియాంగ్ ప్రాంతంలో భూకంపం వచ్చింది. భూమికి 10 కి.మీ. లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.7గా నమోదయింది. ఆ తర్వాత కాసేపటికే మరో భూకంపం వచ్చింది. ఉదయం 10:59 సమయంలో అదే వెస్ట్ సియాంగ్ ప్రాంతంలో మళ్లీ భూమి కంపించింది. ఈ భూకంప కేంద్రం కూడా భూమి నుంచి 10 కి.మీ. లోతులో ఉంది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 3.5గా నమోదయింది. భూకంపాలు వచ్చిన ఈ ప్రాంతం లిపారాడా జిల్లాలోని బాసర్‌ పట్టణానికి 50 కి.మీ. దూరంలో ఉంటుంది. రెండోసారి వచ్చిన భూకంపం చిన్నదే అయినప్పటికీ.. రెండోసారి వచ్చిన భూకంప ధాటికి ప్రజలు వణికిపోయారు. ఇళ్లను ఊగినట్లుగా అనిపించడంతో బయటకు పరుగులు తీశారు.

అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఇవాళ ఉదయం భూమి కంపించింది. అర్ధరాత్రి తర్వాత 02: 29 సమయంలో.. 4.3 తీవ్రతతో భూప్రకంపనలు నమోదయ్యాయి. పోర్ట్‌బ్లెయిర్ సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కి.మీ. లోతున ఇది ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఇది స్పల్ప భూకంపమేనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐతే మంగళవారం నుంచి వరుసగా భూకంపాలు రావడంతో.. ప్రజల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి.

Earthqauke: ఉత్తరాఖండ్‌లో మళ్లీ భూకంపం.. ఇండియా-నేపాల్ సరిహద్దుల్లో అసలేం జరుగుతోంది?

నేపాల్‌లో మంగళవారం అర్థరాత్రి, బుధవారాల్లో సంభవించిన భూకంపం కారణంగా... ఢిల్లీ-ఎన్‌సీఆర్ సహా ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. రాత్రి 1.57 గంటల సమయంలో.. భూమికి 10 కి.మీ. భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. నేపాల్‌తో పాటు, ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తరప్రదేశ్ , బీహార్ , మణిపూర్‌లో కూడా భూమి కంపించింది. మనదేశంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగనప్పటికీ.. నేపాల్‌లో మాత్రం పలు చోట్ల ఇళ్లు కూలి.. ఆరుగురు మరణించారు.

మంగళవారం రాత్రి కూడా ఉత్తరాఖండ్‌లో భూకంపం వచ్చింది. రాత్రి 8.52 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.9గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం ఉత్తరాఖండ్‌లోని భారతదేశం, నేపాల్ సరిహద్దులో ఉంది. ఈ భూకంపాన్ని కూడా భూమికి 10 కి.మీ. లోతులో గుర్తించారు. ఇండియా, నేపాల్ సరిహద్దుల్లో గత రెండు మూడు రోజులుగా వరుస భూకంపాలు వస్తుండడంతో.. అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పెద్ద భూకంపానికి ఇది సంకేతమా? అని టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు.

First published:

Tags: Arunachal Pradesh, Earth quake, Earthquake

ఉత్తమ కథలు