• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • 5 0 MAGNITUDE QUAKE HITS TIBET SAYS CHINA EARTHQUAKE NETWORKS CENTER NK

Quake : టిబెట్‌లో భూకంపం... భూమిలో 9 కిలోమీటర్ల లోతులో...

Quake : టిబెట్‌లో భూకంపం... భూమిలో 9 కిలోమీటర్ల లోతులో...

ప్రతీకాత్మక చిత్రం

Quake in Tibet : ఎవరూ ఊహించకుండా వచ్చేదే భూకంపం. దేశమంతా శివనామస్మరణలతో మారుమోగుతున్న వేళ వచ్చిన భూకంపం కలకలం రేపుతోంది.

  • Share this:
    Quake in Tibet : చైనా ఆధీనంలో ఉన్న టిబెట్‌ స్వతంత్ర ప్రతిపత్తి (Autonomous Region) ప్రాంతంలో రాత్రి 2.01కి భూకంపం వచ్చినట్లు చైనా ఎర్త్ క్వేక్ నెట్‌వర్క్స్ సెంటర్ (CENC) తెలిపింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. ప్రధానంగా గెర్జె కౌంటీలో భూకంప ప్రకంపనల ప్రభావం కనిపించింది. భూమిలోపల 9 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఐతే... ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో వచ్చిన ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరిగిందన్న అంశంపై మాత్రం ప్రస్తుతానికి వివరాలు అందట్లేదు. ఐతే... మరిన్ని ప్రకంపనలు వస్తాయా అన్నదానిపై శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. భూమిలో పలకాల కదలికల వల్లే ఇది వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.




    ప్రధానంగా హిమాలయా పర్వతాల ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు వస్తున్నాయి. కారణం... ఇప్పటికీ హిమాలయ శ్రేణుల కింద ఉన్న పలకాలు ఉత్తర, ఈశాన్య దిశవైపు కదులుతూ ఉండటం వల్లే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.





    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు