Home /News /national /

45 PERCENT NEWLY ELECTED MLAS FACE CRIMINAL CASES AND 87 PERCENT ARE CROREPATIS PVN

ADR Report : కొత్త ఎమ్మెల్యేలలో 45శాతం మందిపై క్రిమినల్ కేసులు,87శాతం కోటీశ్వరులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ADR Report : కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో 45శాతం మందిపై క్రిమినల్ కేసులు. మొత్తం 690 మంది విజేతల్లో 219 మంది తమపై తీవ్రమైన నేరపూరిత కేసులు ఉన్నట్లు ప్రకటించారని ఏడీఆర్ తెలిపింది. 690 మంది విజేతలలో, 614 మంది పురుషులు అయితే 76 లేదా కేవలం 11 శాతం మంది మహిళలు ఉన్నారు,

ఇంకా చదవండి ...
ADR Report On Newly Elected MLAs : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 690 మంది అభ్యర్దుల్లో 45శాతం మందిపై క్రిమినల్​ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ADR)​ తాజాగా ఓ రిపోర్ట్ లో తెలిపింది. ఈ 45 శాతం మందిలో ఎక్కువ మంది బీజేపీ నుంచి ఉన్నట్లు తెలిపింది. తమపై కేసులు ఉన్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో వీరు పేర్కొన్నట్లు వెల్లడించింది. 5 రాష్ట్రాల్లోని మొత్తం 690 మంది విజేతల్లో 219 మంది తమపై తీవ్రమైన నేరపూరిత కేసులు ఉన్నట్లు ప్రకటించారని ఏడీఆర్ తెలిపింది. 690 మంది విజేతలలో, 614 మంది పురుషులు అయితే 76 లేదా కేవలం 11 శాతం మంది మహిళలు ఉన్నారు, ఇక,నేరచరిత్ర ఉన్నట్లు ప్రకటించిన 312 విజేతల్లో 134 మంది బీజేపీ, 71 మంది సమాజ్‌వాదీ పార్టీ, 52 మంది ఆమ్‌ ఆద్మీ పార్టీ, 24 మంది కాంగ్రెస్‌, ఏడుగురు ఆర్​ఎల్​డీ అభ్యర్థులు ఉన్నట్లు ఏడీఆర్​ వెల్లడించింది.ఆరుగురిపై హత్య, 33 మందిపై హత్యాయత్నం, 12 మందిపై మహిళల మీద దాడికి సంబంధించిన కేసులు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. గెలిచిన అభ్యర్దుల్లో 87 శాతం మంది కోటీశ్వరులు అని వివరించింది. వీరి సగటు ఆస్తి 8.7కోట్ల రూపాయలు అని ప్రకటించింది.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు కోటీశ్వరులనని ఏడీఆర్ తెలిపింది. అలాగే, పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికైన మొత్తం ఎమ్మెల్యేల్లో దాదాపు సగం మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్టు వెల్లడించాయి. గత అసెంబ్లీ ఫలితాలతో పోల్చితే.. ఈ సారి నేరపూరిత కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఈ సారి ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయని రిపోర్ట్ వెల్లడించింది. ఒకరిపై మర్డర్ కేసు.. మరో ఇద్దరిపై హత్యా ప్రయత్నం, మరో ముగ్గురిపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని పేర్కొంది.

ALSO READ Sonia Gandhi: అంతా రాజీనామా చేయండి.. వారికి సోనియాగాంధీ కీలక ఆదేశాలు

కొత్తగా పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికైన మొత్తం 117 మందిలో 33.33 శాతం మంది ఆస్తుల విలువ రూ. 5 కోట్లను మించి ఉందని, కాగా, రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల మధ్య ఆస్తులున్నవారు 23.08 శాతం, రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఆస్తులున్నవారు 27.35 శాతం, రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల ఆస్తులున్నవారు 11.97 శాతం, రూ. 10 లక్షలలోపు ఉన్నవారు 4.27 శాతం మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలిపింది. 92 మంది పంజా ఆప్ ఎమ్మెల్యేల్లో 63 మంది కోటీశ్వరులు అని, 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 17 మంది కోటీశ్వరులేనని, శిరోమణికి చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే , ఒక బీఎస్పీ ఎమ్మెల్యే, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేలూ ఈ కేటగిరీలోనే ఉన్నారు. కాగా, గత అసెంబ్లీలో 81 శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే ఉండేవారని వివరించారు.

అత్యధిక సంపన్నులైన టాప్ టెన్ ఎమ్మెల్యేల్లో ఐదుగురు కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు ఆప్ నుంచి ఒకరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Goa, Manipur, Punjab, Uttar pradesh, Uttarakhand

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు