హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం... 44మంది మృతి

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం... 44మంది మృతి

Video : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 44మంది మృతి

Video : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 44మంది మృతి

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అనాజ్‌మండిలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 44 మంది మృతి చెందారు. మరో 50 మందికి గాయాలయ్యాయి.

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అనాజ్‌మండిలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 44 మంది మృతి చెందారు. అనాజ్‌మండిలో ప్లాస్టిక్ తయారీ భవనంలో మంటలు వ్యాపించాయి. విపరీతమైన పొగ, మంటలతో ఊపిరాడకనే ఇంతమంది మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన భవనంలో ప్లాస్టిక్ బ్యాగులు తయారు చేసినట్లు సమాచారం. దీంతో ప్లాస్టిక్‌కు మంటలు అంటుకొని వ్యాపించాయి. ఆ ప్లాస్టిక్ కాలిన వాసనకే... అనేకమంది ఊపిరాడక చనిపోయినట్లు సమాచారం. మరో 50 మందికి గాయాలయ్యాయి. 30 ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటల్ని అదుపు చేస్తున్నాయి. ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయపడ్డవారిని లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  తెల్లవారుజామున 5: 22 నిమిషాలకు అగ్నిప్రమదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

అగ్నిప్రమాదం జరిగిన భవనం

మరోవైపు అగ్నిప్రమాద ఘటనపై ప్రముఖ రాజకీయ నేతలు స్పందించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రమాద ఘటనపై స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు తొందరగా కోలుకోవాలని ఆకాక్షించారు.

First published:

Tags: Delhi, Fire Accident