హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

vaccine wastage ; విచిత్రం..ఓ వైపు షార్జెజ్...మరోవైపు వేస్టేజ్...ఏ రాష్ట్రాలు ఎంత వ్యాక్సిన్ వేస్ట్ చేశాయి..?

vaccine wastage ; విచిత్రం..ఓ వైపు షార్జెజ్...మరోవైపు వేస్టేజ్...ఏ రాష్ట్రాలు ఎంత వ్యాక్సిన్ వేస్ట్ చేశాయి..?

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో న్యాయస్థానాలు కలుగజేసుకోవడం అనవసరమని కేంద్రం పేర్కొంది. ఈ అంశంపై న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటే ఊహించని, అనాలోచిత పరిణామాలకు దారితీస్తుందని అభిప్రాయపడింది.

కరోనా వ్యాక్సినేషన్ విషయంలో న్యాయస్థానాలు కలుగజేసుకోవడం అనవసరమని కేంద్రం పేర్కొంది. ఈ అంశంపై న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటే ఊహించని, అనాలోచిత పరిణామాలకు దారితీస్తుందని అభిప్రాయపడింది.

vaccine wastage ; దేశంలో కరనా వ్యాక్సిన్ పంపిణి మరియు ఉపయోగంలో విచిత్ర పరిస్థతి నెలకొంది. ఓవైపు వ్యాక్సిన్ కొరత ఉందంటూనే మరోవైపు కొన్ని రాష్ట్రాల నిర్లక్ష్యం వల్ల లక్షల వ్యాక్సిన్ డోసులు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి.


దేశంలో కరనా వ్యాక్సిన్ పంపిణి మరియు ఉపయోగంలో విచిత్ర పరిస్థతి నెలకొంది. ఓవైపు వ్యాక్సిన్ కొరత

ఉందంటూనే మరోవైపు కొన్ని రాష్ట్రాల నిర్లక్ష్యం వల్ల లక్షల వ్యాక్సిన్ డోసులు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. దీంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిరంతరం వ్యాక్సిన్ ఉత్పత్తి చేయిస్తున్నా..ఫలితం మాత్రం లేకుండా పోతుంది... ఇలా ఇప్పటివరకు 44 లక్షల వ్యాక్సిన్ డోసులు ఎందుకు పనికిరాకుండా పోయాయి.

కేంద్రం వ్యాక్సిన్ ఉత్పత్తి సరఫరాలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... కొన్ని రాష్ట్రాలకు సరైన సరఫరా లేదనే విమర్శలు తలెత్తుండడంతో పాటు తమకు తక్కువ డోసులు పంపిణి చేస్తున్నారనే విమర్శలు కూడ ఎదుర్కోంటుంది. కాగా తెలంగాణలో కూడ వ్యాక్సిన్ సరఫరా లేక ఆదివారం వ్యాక్సినేషన్ కు

హలిడే ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఇక్కడ కేంద్రం పంపిణి చేసిన వ్యాక్సిన్ లో 7.55 శాతం పంపిణి కాకుండా వేస్టేజ్ గా మిగిలిపోయిన పరిస్థితి నెలకొంది.

దీంతో కరోనా కట్టడికి కేంద్రం వేల కోట్ల రూపాయలతో వ్యాక్సిన్ తయారికి నడుం బిగించిన విషయం తెలిసిందే.20 19 కొవిడ్ నేపథ్యంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తికి కేంద్రం బీజం వేసింది. దీంతో ఈ సంవత్సరం మొదటి నెల నుండి వ్యాక్సిన్ పంపిణి చేస్తోంది. అయితే చాల విలువైన వ్యాక్సిన్‌ను కాపాడుకోవడంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. దీంతో లక్షల డోసులు నిరుపయోగంగా మిగిలిపోయాయి.

జనవరి మొదటి వారం నుండి ఈ నెల ఎప్రిల్ 11 వరకు మొత్తం 10 కోట్ల డోసులను కేంద్రం ఆయా రాష్ట్ర్రాలకు సరఫరా చేసింది. అయితే ఇందులో సుమారు 44 లక్షల డోసులు నిరుపయోగంగా మారిననట్టు ఆర్టీఐ ద్వార తెలిసింది. ముఖ్యంగా వ్యాక్సిన్‌ ఎక్కువశాతం వెస్టేజ్ చేసిన రాష్ట్ర్రాల్లో 12.10

శాతంతో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా వరుసగా హర్యాన 9.7 శాతం, పంజాబ్ 8.10 శాతం మణిపూర్ 7.8 శాతం,లు ఉన్నాయి. ఇక జాబితాలో తెలంగాణ రాష్ట్రం కూడ చేరింది తెలంగాణకు చేరిన డోసుల్లో మొత్తం 7.55 శాతం డోసులు వేస్టేజ్ గా మారినట్టు ఆర్టీఐ సమాచారం అందించింది.

అయితే వ్యాక్సిన్ వేస్టేజ్ చేయని రాష్ట్రాలు కూడ ఉన్నాయి..వాటిలో ముఖ్యంగా కేరళ ,వెస్ట్ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మీజోరాం ,గోవా, అండమాన్ నికోబార్ , లక్ష్యద్వీప్, డామన్ మరియు డయ్యు దీవులు కూడ వ్యాక్సిన్ డోసులను చాల జాగ్రత్తగా ఎలాంటీ వేస్టేజ్ లేకుండా ఉపయోగించుకుంటున్నాయి.కాగా వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఇటివలే విదేశాల్లో తయారికి కూడ భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతోపాటు

స్వదేశంలో తయారి సంస్థలకు ఇటివలే 4500 కోట్ల రూపాలయను విడుదల చేసినట్టు ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపాయి. ఇంతపెద్ద మొత్తంలో వ్యాక్సిన్ తయారికి ఖర్చు పెడుతున్నా..సరైనా ప్రణాళిక లేకపోవడంతో నిరుపయోగంగా తయారవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికైన వ్యాక్సిన్ వేస్టేజ్ లేకుండా

ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటే..చాల మంది ప్రాణాలు పోకుండా కాపాడేందుకు అవకాశం ఉంటుంది.

First published:

Tags: Corona Vaccine, Tamilandu, Telangana

ఉత్తమ కథలు