కరోనా ఎఫెక్ట్.. ఆ జైలు నుంచి 419 మంది ఖైదీల విడుదల

తీహార్ జైలు(File)

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా జైళ్లలో రద్దీని నియంత్రించేందుకు తాత్కాలికంగా ఖైదీలను విడుదల చేశారు. అందులోభాగంగా తీహార్ జైలు నుంచి 419 మంది ఖైదీలను విడుదల చేశారు.

  • Share this:
    కరోనా వైరస్ వ్యాప్తితో దేశ ప్రజలంతా వణికిపోతుంతే.. వారికి మాత్రం కాస్తంత ఉపశమనం దొరికింది. కరోనా వైరస్ వ్యాప్తి భయాందోళనల నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేసేందుకు జైళ్ల శాఖ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లోని 71 జైళ్లలో 11 వేలమంది ఖైదీలను ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా, తీహార్ జైలు నుంచి 419 మందిని విడుదల చేస్తున్నట్టు తెలిసింది. తీహార్ జైలులోని దాదాపు 3వేల మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. అందులో మొదటి విడతగా జైలులోని 419 మంది ఖైదీలను శనివారం విడుదల చేశారు.

    ఇందులో 356 మందిని మధ్యంతర బెయిల్ మీద 45 రోజుల పాటు, మరో 63 మందిని అత్యవసర పెరోల్‌పై 8 వారాల పాటు విడుదల చేశారు. తీహార్ జైలులో 10వేల మంది ఖైదీలు ఉండే సామర్థ్యం ఉంది. కానీ అక్కడ ఇప్పటికే 18వేల మంది ఖైదీలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని జైళ్లలో రద్దీని తగ్గించేందుకు ఖైదీలను విడుదల చేశారు. నిజానికి జైలు నిబంధనల ప్రకారం.. పెరోల్ మీద కేవలం నాలుగు రోజుల మాత్రమే విడుదల చేసేందుకు అనుమతించేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం సవరణలు చేసింది.
    Published by:Narsimha Badhini
    First published: