Man With Five Kidneys: అతడి శరీరంలో ఐదు మూత్రపిండాలు.. ఎందుకలా.. పూర్తి వివరాలను తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

Man With Five Kidneys: కిడ్నీ విఫలమైతే ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ ఒకసారి చేయించుకోవడమే చాలా కష్టమైన ప్రక్రియ. కానీ చైన్నైలో అరుదైన రీతిలో ఓ వ్యక్తికి మూడు సార్లు కిడ్నీలను అమర్చారు. అయితే ఇతర అనారోగ్యాల కారణంగా పనిచేయని మూత్రపిండాలను తొలగించడం కుదరలేదు. దీంతో బాధితుడు మొత్తం ఐదు మూత్రపిండాలతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. పూర్తి వివరాలివే..

  • Share this:
కిడ్నీ విఫలమైతే ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ ఒకసారి చేయించుకోవడమే చాలా కష్టమైన ప్రక్రియ. కానీ చైన్నైలో అరుదైన రీతిలో ఓ వ్యక్తికి మూడు సార్లు కిడ్నీలను అమర్చారు. అయితే ఇతర అనారోగ్యాల కారణంగా పనిచేయని మూత్రపిండాలను తొలగించడం కుదరలేదు. దీంతో బాధితుడు మొత్తం ఐదు మూత్రపిండాలతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. తీవ్ర రక్తపోటుతో బాధపడుతున్న ఈ 41 ఏళ్ల వక్తికి ఇటీవలే చెన్నైలోని మద్రాస్ మెడికల్ మిషన్ ఆసుపత్రిలో మూడోసారి కొత్త కిడ్నీ అమర్చారు. శస్త్రచికిత్స అనంతరం రోగి కోలుకున్నాడని వైద్యులు తెలిపారు. శరీరంలో ఎక్కువ స్థలం లేనందున ట్రాన్స్ ప్లాంట్ చేయడం కష్టతరమైందని వైద్యులు చెప్పారు. రోగి ఇప్పటికే రెండు సార్లు మూత్రపిండాల శస్త్రచికిత్స చేయించుకున్నాడని, కానీ అవి విఫలమయ్యాయని తెలిపారు. అయితే రక్తస్రావమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందువల్ల, పనిచేయని కిడ్నీలను తొలగించడం కుదరదని వైద్యులు చెబుతున్నారు.

కరోనరి ఆర్టరీ వ్యాధితో బాధపడుతున్న బాధితుడికి ఇటీవలే ట్రిపుల్ బైపాస్ సర్జరీ జరిగింది. ఈ కారణంగా స్పెషలిస్టుల బృందం పలు జాగ్రత్తలు తీసుకుంది. చాలా చర్చల అనంతరం మూత్రపిండాల మార్పిడే ఉత్తమ ఎంపికని వైద్యులు భావించారు. రోగి శరీరంలో పుట్టుకతో ఉన్న రెండు కిడ్నీలతో పాటు దాత ఇచ్చిన మరో రెండు మూత్రపిండాలు ఉన్నాయి. అనంతరం ఐదో మూత్రపిండానికి స్థలాన్ని కనుగొనాల్సి వచ్చింది. మూడోసారి కిడ్నీ మార్పిడి ప్రక్రియను మద్రాస్ ఆసుపత్రిలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్ శరవణన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నియంత్రణలో లేని రక్తపోటు కారణంగా అతనికి మొదటి రెండు సార్లు చేసిన కిడ్నీ మార్పిడి సర్జరీలు విఫలమయ్యాయి. మార్చిలో ఇదే ఆసుపత్రిలో అతడు ట్రిపుల్ బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నాడని శరవణన్ తెలిపారు.

Read Also: వివాహితకు ప్రేమ లేఖ రాశాడు.. హైకోర్టు విధించిన శిక్షకు షాక్ అయ్యాడు.. ఇంతకు ఏం జరిగిందంటే..


రోగి వైద్య రికార్డులను పరిశీలిస్తే 1994లో మొదటి సారి అతడికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు అతడి వయస్సు 14 ఏళ్లు. తొమ్మిదేళ్లపాటు ఆ మూత్రపిండం పనిచేసింది. 2005లో రెండో సారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అది 12 ఏళ్ల పాటు పనిచేసింది. గత నాలుగేళ్లుగా కిడ్నీ సమస్య వల్ల రోగికి వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయాల్సి వచ్చేది. దీంతో డయాలసిస్ యంత్రాన్ని అమర్చారు. సాధారణంగా దీర్ఘకాలిక మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల్లో శరీర వ్యర్థాలను వడపోసే కిడ్నీలు పనిచేయడం ఆపివేస్తాయి. ఫలితంగా రోగి పెను సమస్యలను ఎదుర్కొంటాడు. అప్పుడు డయాలసిస్ యంత్రాల ద్వారా మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది.
Published by:Veera Babu
First published: